HILT Leak Row: సర్కార్ ఇలా డెసిషన్ తీసుకుంటుందో లేదో అలా లీక్. వెంటనే ప్రతిపక్షం చేతికి కాపీ. జీవో ఇష్యూ కాకముందే అపోజిషన్ వాయిస్ రేజ్. ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనూ ఇలాంటి సీనే రిపీట్ అయింది. కాకపోతే ఇప్పుడు హిల్ట్ హీట్ సర్కార్‌కు గట్టిగా తాకుతోందట. లీకువీరులను ఐడెంటిఫై చేసేందుకు విజిలెన్స్‌ను రంగంలోకి దించారట సీఎం రేవంత్. ఇంతకు హిల్ట్ పాలసీపై బయటికి హింట్ ఇచ్చిందెవరు? ఆ కోవర్టు.. ఆఫీసరా లేక అధికార పార్టీ నేతనా? ప్రైమరీ ఎంక్వైరీలో తేలిందేంటి.?
హిల్ట్ హీట్ తెలంగాణ గట్టు అగ్గి రాజేస్తోంది. రేవంత్ సర్కార్ ఇలా డెసిషన్ తీసుకుందో లేదో..అలా ప్రతిపక్షానికి లీక్ అవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. పాలసీ పే చర్చ అంటూ..కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ రచ్చ అంతా ఓ వైపు నడుస్తుండగానే..హిల్ట్ పాలసీపై బయటికి సమాచారం చేరవేసిందెవరన్నది పెద్ద చర్చగా మారింది. కోవర్టుల కథేంటో తేల్చేందుకు రేవంత్ సర్కార్ విజిలెన్స్‌ను రంగంలోకి దింపడం..మరింత హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై లెన్స్ లేసుకుని..స్కాన్ చేస్తున్న బీఆర్ఎస్..సర్కార్ తీరుపై ఒంటికాలుపై లేస్తోంది. హిల్ట్ పాలసీని అడ్డుపెట్టుకుని..రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీశారని..కేటీఆర్ చేసిన ఆరోపణలు..స్టేట్ పాలిటిక్స్‌కు షేక్ చేస్తున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ ఆందోళనకు కూడా దిగుతోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీని తీసుకొచ్చింది. సిటీ మధ్యలో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకి తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హిల్ట్ పాలసీ విధానం ద్వారా.. 9వేల 292 ఎకరాల ఇండస్ట్రియల్ భూముల కన్వర్షన్‌కు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఫ్యాక్టరీలుగా ఉన్న భూములకు హిల్ట్ పాలసీతో మల్టీ-యూజ్ జోన్లుగా మార్చడానికి అనుమతి ఇచ్చింది. దీనిపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఉడికిపోతున్న రేవంత్ సర్కార్..బీఆర్ఎస్‌కు అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగానే..హిల్ట్ పాలసీ లీక్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ప్రభుత్వం హిల్ట్ పాలసీని అధికారికంగా ప్రకటించకముందే..కేటీఆర్ చేతికి ఎలా చేరింది? కేటీఆర్‌కు సమాచారాన్ని చేరవేసింది ఎవరన్నది తేల్చే పనిలో పడింది ప్రభుత్వం.
లీకుల వెనుక అధికారా? ప్రజాప్రతినిధి?
సర్కార్ నిర్ణయాలు..ప్రతిపక్షాలకు చేరుతుండటం..అందరి కంటే ముందే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంపై ఆగ్రహంగా ఉన్న రేవంత్ రెడ్డి…. విజిలెన్స్‌ను రంగంలోకి దింపారట. ప్రభుత్వం నిర్ణయాలను బీఆర్ఎస్‌కు చేరవేస్తున్న కోవర్టులను గుర్తించే పనిలో ఉన్నారట. హిల్ట్ పాలసీ బీఆర్ఎస్ భవన్‌కు చేరడం వెనక.. అధికారి ఉన్నాడా..? లేక ప్రజాప్రతినిధి ఉన్నాడా అని తేల్చేందుకు విజిలెన్స్ ఫోకస్ పెట్టిందట. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులోనే కొంత క్లారీటి వచ్చినట్లు టాక్. పాలసీ తయారీ టైమ్‌లోనే లీక్ జరిగిందని అనుమానిస్తున్నారట.
పరిశ్రమల శాఖలో ఈ ఫైల్ ఎవరెవరి చేతుల మీదుగా వెళ్లింది? సెక్షన్ ఆఫీసర్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఫైల్‌ను డీల్ చేసిందెవరు? అన్న వివరాలను సేకరిస్తున్నారట. కింది స్థాయి సిబ్బంది నుంచి లీక్ అయ్యిందా? లేక ఉన్నత స్థాయి అధికారులే దీని వెనుక ఉన్నారా.? ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారట.
విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత..ఒక్క హిల్ట్ పాలసీ లీకే కాదు..గతంలో కూడా ఇలాగే బీఆర్ఎస్‌కు సమాచారం చేరవేసిన కోవర్టుల భరతం పట్టేందుకు..పక్కా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. విజిలెన్స్ నివేదిక వచ్చాక లీకు వీరుడిపై వేటే కాదు..ఇంటి దొంగలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలా యాక్షన్ ఉంటుందని అంటున్నారు.
Also Read: నమ్మిన కలప వ్యాపారులే నట్టేట ముంచేశారా..! మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో సంచలనం..!