Gossip Garage: కేటీఆర్‌ కాంగ్రెస్‌కు టార్గెట్ అయ్యారా? ఈసారి అరెస్ట్ తప్పదా?

కొంత కాలంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు మౌనంగా ఉన్న ఏసీబీ ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా కేటీఆర్‌కు నోటీసుల ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

KTR

Gossip Garage: విమర్శ ఏదైనా, కేసు మరేదైనా ఆయనే టార్గెట్. ఏ కాంగ్రెస్ నేత మాట్లాడినా చివరికి మంత్రులు, సీఎం మాట్లాడినా.. ఆయన పేరు తీయకుండా విమర్శ చేయలేని పరిస్థితి. మరోసారి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెరమీదకు రావటం, కేటీఆర్ కు నోటీసులు అందటంతో గులాబీ దళంలో టెన్షన్ కనిపిస్తోంది. సోమవారం కేటీఆర్ ఏసీబీ విచారణకు రానున్నారు. ఈసారి ఆయన అరెస్ట్ పక్కా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా గతంలో ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయటంతో సోమవారం ఏం జరగబోతోంది అని ఇటు బీఆర్ఎస్ వర్గాలతో పాటు అటు రాజకీయవర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

వరల్డ్‌ లెవల్‌ రేస్. అంతే స్థాయిలో కాంట్రవర్సీ. ఏసీబీ కేసుతో మొదలై.. ఈడీ ఎంటరై.. సెన్సేషనల్‌గా మారిన ఫార్ములా ఈ కారు రేస్‌ కేసు రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే ఓ సారి ఏసీబీ, మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. గత నెల 28న మరోసారి విచారణుక రావాలని కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఆయన ముందస్తు షెడ్యూల్ ప్రకారం అమెరికా పర్యటనకు వెళ్లడంతో అప్పుడు విచారణకు హాజరుకాలేకపోయారు. ఈ నెల 16న విచారణకు రావాలని మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఇప్పటికే కేటీఆర్‌తో పాటు అధికారులను, అలాగే కార్ రేస్ నిర్వాహకులను ఏసీబీ ప్రశ్నించింది. అయితే లేటెస్ట్‌ నోటీసులపై కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. ఏసీబీకి కచ్చితంగా సహకరిస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇదే సమయంలో పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని ఆ కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు కేటీఆర్. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి గారి సమక్షంలో లైడిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని సవాలు విసిరారు కేటీఆర్.

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కారే రేస్ కేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని, తన ఇంట్లో ఏసీబీ సోదాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. తన దగ్గర ఏం లేకపోయినా.. ఇంట్లో తనకు సంబంధం లేని పత్రాలను సాక్షాల రూపంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆనుమానం వ్యక్తం చేశారు. అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్న కేటీఆర్..ఎలాగైనా తనను అరెస్ట్ చేయించాలన్న కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నారని గతంలో మండిపడ్డారు.

సేమ్‌టైమ్‌ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని గతంలోనే ఆఫ్‌ ది రికార్డులో చెప్పారు కేటీఆర్. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 16న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకాబోతున్నారు. దీంతో ఈ సారి విచారణ అనంతరం కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగినా.. అది జరగలేదు. కొంత కాలంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు మౌనంగా ఉన్న ఏసీబీ ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా కేటీఆర్‌కు నోటీసుల ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈసారి తనను కచ్చితంగా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ కూడా అనుమానం వ్యక్తం చేయడం బీఆర్ఎశ్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోందట.

ఫార్ములా ఈ కారు రేస్‌ ఇష్యూలో ఏసీబీ ఫైల్ చేసిన FIRలో కేటీఆర్‌ A-1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ-2గా ఉన్నారు. ఏ-2గా ఉన్న అరవింద్ కుమార్‌ అప్రూవర్‌గా మారిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్ రేస్ నిర్వహణలో విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపుల వ్యవహారంలో తన ప్రమేయం ఏం లేదని..అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నానని అరవింద్ కుమార్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ పేరును ఏ-1గా చేర్చిందని అంటున్నారు. ఆయన టార్గెట్‌గానే విచారణ జరుగుతోందని..ఈ సారి కేటీఆర్‌ అరెస్ట్ పక్కా అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత ఏం జరగబోతోందో చూడాలి మరి.