Cm Revnath Reddy: టెంపుల్ రన్.. ఆలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. స్కెచ్‌ మూమూలుగా లేదుగా..!

భద్రాచలం సీతారామ ఆలయం అభివృద్ధి పనులకు శ్రీరామ నవమి సంధర్భంగా శంకుస్థాపన చేయ‌గా..లేటెస్ట్‌గా బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ చేశారు.

  • Published On : April 10, 2026 / 06:30 AM IST
  • భద్రాచలం టు బాసర..ఆలయాలకు నిధులు, పనులు
  • హిందుత్వ ఎజెండాకు కౌంటర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారా.?
  • పొలిటికల్‌ స్కెచ్‌లో భాగంగానే టెంపుల్‌ రన్ చేస్తున్నారా.?
  • దేవాలయాల డెవలప్‌మెంట్‌తో బీజేపీని ఢీకొట్టే స్కెచ్చా?

 

Cm Revnath Reddy: అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సై అనేలా..వ్యూహాలను పదును పెడుతున్నాయి పార్టీలు. తెలంగాణ‌లో పొలిటిక‌ల్ సినారియో స్పీడ్‌గా మారిపోతుంది. వ‌చ్చే జ‌న‌ర‌ల్ ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకొని..సీఎం రేవంత్ అయితే పెద్ద స్కెచ్‌లే వేస్తున్నారట. ప్రత్యర్థుల కంటే ఓ అడుగు ముందుకేసి..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రధాన ఆయుధంగా మారే ఎజెండాను భుజాన ఎత్తుకుంటున్నారట. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రూటు మార్చార‌ట‌. దేవాల‌యాల డెవలప్‌మెంట్‌ పేరుతో కొత్త ఎత్తుగడ వేస్తున్నారట. ఆలయాల అభివృద్ధిపై రేవంత్ ఎందుకు అంత ఫోక‌స్ పెట్టినట్లు?

ఇప్పుడే కాదు. నెక్స్ట్ టర్మ్‌ కూడా పవర్ మాదే. పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది. రాసిపెట్టుకోండని..పదేపదే చెబుతున్న సీఎం రేవంత్..తన మాట‌ల‌తో క్యాడ‌ర్‌లో కాన్ఫిడెన్స్‌ను పెంచుతూనే..మ‌రోవైపు స‌రికొత్త వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కాలంటే.. కేవ‌లం అభివృద్ధి, సంక్షేమమే కాదు.. పొలిటిక‌ల్ వ్యూహాల‌ను ఇంప్లిమెంట్‌ చేసే పనిలో బిజీగా ఉన్నారట. రాష్ట్రంలో వ‌చ్చే ఎల‌క్షన్స్ కాస్త భిన్నంగా జ‌రిగే అవ‌కాశం ఉంద‌నేది రేవంత్ అంచనా అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌లు జ‌మిలీ ప‌ద్దతిలో..పార్లమెంట్‌, అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్స్‌ జరిగే అవకాశం ఉంది. దీంతో బీజేపీ త‌న అమ్ముల‌పొదిలోని అస్త్రాల‌ను..మరీ ముఖ్యంగా హిందుత్వ ఎజెండాను ముందు పెట్టే అవ‌కాశం ఉంద‌ని సీఎం భావిస్తున్నార‌ట‌. అందుకే బీజేపీ ఎత్తుల‌కు పైఎత్తులు వేయాల‌నే ఆలోచ‌న‌తో తన మార్క్‌ వ్యూహాలకు పదును పెడుతున్నారట రేవంత్‌. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి తరచూ ఆలయాల సందర్శనకు వెళ్తున్నారట. అంతేకాకుండా కొత్త ఆలయాలకు శంకుస్థాపనలు, ఇప్పటికే పేరుగాంచిన దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ జోరు పెంచారని అంటున్నారు.

బీజేపీకి మాత్రమే హిందుత్వ ఆయుధం సొంతం కాకుండా ప్లాన్..!

బీజేపీకి మాత్రమే హిందుత్వ ఆయుధం సొంతం కాకుండా..టెంపుల్స్ డెవలప్‌మెంట్‌తో సరికొత్త ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్. అందుకే తెలంగాణ కుంభమేళ మేడారం జాతర సమయంలోనూ సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం చేశారు. అక్కడ‌ శాశ్వత నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక వేములవాడ రాజరాశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇటీవల మూసీ ఒడ్డున ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు సీఎం.

భద్రాచలం టు బాసర..ఆలయాలకు నిధులు, పనులు

మరోవైపు భద్రాచలం సీతారామ ఆలయం అభివృద్ధి పనులకు శ్రీరామ నవమి సంధర్భంగా శంకుస్థాపన చేయ‌గా..లేటెస్ట్‌గా బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ చేశారు. ఆదిలాబాద్‌లో గిరిజ‌నుల ఆరాధ్యదైవంగా ఉన్న నాగోబా జాతరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది రేవంత్ స‌ర్కార్‌. అంతేకాదు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు జరగనుండటంతో గోదావరి నదిపై పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది ప్రభుత్వం. గోశాలల అభివృద్ధి, గొత్త గోశాలల ఏర్పాటుపై ఇప్పటికే మూడు, నాలుగు సార్లు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం విశేషం.

మెజార్టీ హిందువుల ఓట్లు బీజేపీకి వెళ్లకుండా క‌ట్టడి చేసే వ్యూహం..!

ఆలయాలు అభివృద్ధి చెందిన చోట ఎకనామిక్ గ్రోత్ ఉంటుందని..ఒక రకంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. మరోవైపు రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేయడానికి టెంపుల్స్‌ డెవలప్‌మెంట్‌ అంశం ఉపయోగపడుతుంద‌ని లెక్కలు వేసుకుంటున్నార‌ట‌. బీజేపీని కట్టడి చేస్తే..నెక్ట్స్ జమిలీ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు లాభమే తప్ప నష్టం ఉండదనేది రేవంత్ రెడ్డి అంచనాగా చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ కలసి పోటీ చేస్తాయని సీఎం రేవంత్ రెడ్డి బలంగా చెప్తున్నారు.

అదే నిజమైతే రెండు పార్టీలను ఎదుర్కొనేలా వ్యూహాలు రచిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. గత పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాల్లో కూడా అయోధ్య నుంచి తెచ్చిన అక్షింతలు పంచడం బీజేపీకి బాగా కలిసి వచ్చిందని..8 ఎంపీ సీట్లు గెలవడానికి ఉపయోగపడిందనేది ఇంటర్నల్‌ డిస్కషన్ పాయింట్‌గా ఉంది. ఈ సారి మెజార్టీ హిందువుల ఓట్లు బీజేపీకి వెళ్లకుండా క‌ట్టడి చేయాల‌నే ఆలోచ‌న‌లో భాగంగానే..సీఎం రేవంత్‌ దేవాల‌యాల అంశాన్ని ఎత్తుకున్నట్లు చర్చ జరుగుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఇప్పటినుంచే ఫోక‌స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గెలిచి తీరేందుకు అస్త్రాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారట. కాంగ్రెస్‌కు ఉండే సెక్యుల‌ర్ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే..మెజారిటీ వ‌ర్గమైన హిందువుల‌ను మ‌రింత‌గా త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో..సీఎం రేవంత్ ఒక నినాదాన్ని బ‌లంగా తీసుకెళ్లబోతున్నారని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలని గ‌తంలో చెప్పిన నినాదం ప్రజల్లోకి తీసుకెళ్లి..వచ్చే ఎన్నికల్లో బీజేపీని క‌ట్టడి చేయాల‌నేది రేవంత్‌ ఆలోచన అంటున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌ వేస్తున్న పొలిటికల్ ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.