×
Ad

సర్కారు కీలక ఆదేశాలు.. ఇకపై మార్కుల పేరుతో స్టూడెంట్లను సెక్షన్లుగా విభజించారో..

విద్యార్థుల్లో ఎలాంటి అసమానతలు తలెత్తకుండా, వారిపై వివక్ష లేకుండా అందరినీ ఒకే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

Students

  • అలా విభజిస్తే స్టూడెంట్లపై మానసిక ఒత్తిడి
  • వారిలో అసమానతలు పెరుగుతున్నాయి
  • విద్యార్థులందరినీ సమాన దృష్టితో చూడాల్సిందే

Telangana Government: బాగా చదివే విద్యార్థులు, మార్కులు తక్కువ వస్తున్న విద్యార్థులు అంటూ స్టూడెంట్లను అనేక స్కూళ్లు, కాలేజీలు విభజిస్తుంటాయి. మార్కుల పేరుతో స్టూడెంట్లను సెక్షన్లుగా విభజించవద్దని తెలంగాణ సర్కారు ఆదేశాలు ఇచ్చింది.

దీంతో స్టూడెంట్లపై మానసిక ఒత్తిడితో పాటు వారిలో అసమానతలు పెరుగుతున్నాయని రాష్ట్ర సర్కారు గుర్తించింది. విద్యార్థులను సమాన దృష్టితో చూడాలని చెబుతోంది. విద్యార్థుల్లో ఎలాంటి అసమానతలు తలెత్తకుండా, వారిపై వివక్ష లేకుండా అందరినీ ఒకే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

The Rajasaab: అర్ధరాత్రి జీవో జారీ.. తెలంగాణాలో రాజాసాబ్ టికెట్ ధరలు పెంపు

నిబంధనలను ఉల్లంఘిస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. మార్కుల టార్గెట్ల పేరుతో పిల్లలను చులకన చేసి చూడొద్దని చెప్పింది. వారిని అందరి ముందు తిట్టినా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్కూళ్లు, కాలేజీలకు వార్నింగ్ ఇచ్చింది.