డిస్కౌంట్‌ ఉన్నప్పటికీ ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇంకా అప్లై చేసుకోలేదా? గడువు పొడిగింపు.. ఈ సారి మిస్‌ చేసుకోకండి..

ఎల్‌ఆర్‌ఎస్ కోసం వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ గడువు పెంచింది.

LRS Scheme

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం 25 శాతం డిస్కౌంట్‌తో అప్లై చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దరఖాస్తులు చేసుకునేందుకు మే 3 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

ఇప్పుడు గడువును మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ కోసం వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ గడువు పెంచింది. ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును పెంచాలని మే 3న మున్సిపల్ శాఖ అధికారులు కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు.

Also Read: ‘నువ్వు చనిపోతే నేనెట్టా బతుకుతా బిడ్డా..’ కొడుకు మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య.. హృదయ విదారక ఘటన

కాగా, ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని 2020లో బీఆర్ఎస్‌ సర్కారు ప్రకటించింది. అయితే, పలు కారణాల వల్ల అధికారులు ఐదేళ్లలో 9 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. దీంతో క్రమబద్ధీకరణకు 25 శాతం డిస్కౌంట్‌ ప్రకటిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఇప్పటివరకు 7 లక్షల మంది ఫీజు చెల్లించారని అధికారులు అంటున్నారు. దీంతో, రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంటున్నారు.