Warangal Carnival: శాస్త్రీయ నైపుణ్యంలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

బయో గ్యాస్ ను వంట చేసుకోవటానికి మాత్రమే కాదు, విద్యుత్ గా కూడా మార్చవచ్చు అని కాజీపేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే (MJP) స్కూల్ (బాలికలు) చూపితే, పెద్దాపూర్‌లోని MJP(గర్ల్స్) స్కూల్‌ హెచ్చరిక అలారం వ్యవస్థను సృష్టించి విద్యుత్ ని ఎలా ఆదా చేయవచ్చో చూపింది

Warangal Carnival: శాస్త్రీయ నైపుణ్యంలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

Updated On : September 24, 2023 / 9:31 PM IST

Warangal Carnival: నేటి విద్యార్థులలో అసాధారణ ప్రతిభ వుంది. చేయాల్సిందల్లా వారి ప్రతిభకు మెరుగులద్దటం, వారి నైపుణ్యం ప్రదర్శించుకునే వేదిక అందించటం. అలాంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నైపుణ్యాలు, అత్యుత్తమ ఆలోచనలను ప్రదర్శించేందుకు వరంగల్ లో నిర్వహించిన కార్నివాల్ వేదికగా నిలిచింది.

బయో గ్యాస్ ను వంట చేసుకోవటానికి మాత్రమే కాదు, విద్యుత్ గా కూడా మార్చవచ్చు అని కాజీపేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే (MJP) స్కూల్ (బాలికలు) చూపితే, పెద్దాపూర్‌లోని MJP(గర్ల్స్) స్కూల్‌ హెచ్చరిక అలారం వ్యవస్థను సృష్టించి విద్యుత్ ని ఎలా ఆదా చేయవచ్చో చూపింది. కమలాపూర్ MJP (బాయ్స్) పాఠశాల విద్యార్థులేమో సేంద్రీయ నీటి శుద్దీకరణ ప్రాజెక్ట్ కార్న్ కాపర్ ను ఉపయోగించి సేంద్రీయ నీటి శుద్దీకరణను చూపించారు.

Bihar: బిహార్‌లో మళ్లీ కల్తీ మద్యం కలకలం.. ఇద్దరి మృతి.. కంటిచూపు కోల్పోయిన ముగ్గురు

ఇక మరిడ్‌పెడలోని MJP స్కూల్ నుంచి సోలార్ డ్రిప్ ఇరిగేషన్ మోడల్‌ను ప్రదర్శించారు. ఇవేనా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి వంటి ఐదు జిల్లాలకు చెందిన పలు MJP ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 146 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులు స్టెమ్ ( సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) విభాగంలో తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు. వందలాది ఎంట్రీల నుంచి 48 “మార్పు ప్రాజెక్ట్‌లు” ఎంపిక చేసి ఇక్కడ ప్రదర్శించారు.

Survey on Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలా? ప్రజలు ఏమంటున్నారు?

షెల్ కు చెందిన గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ సోషల్ ఇన్వెస్ట్‌మెంట్ స్టెమ్ విద్యా కార్యక్రమంలో భాగంగా NXplorers పేరుతో జూనియర్ ప్రోగ్రామ్ నిర్వహించింది. అందులో కనిపించిన ప్రదర్శనలే ఇవన్ని. ఇది యునైటెడ్‌నేషన్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGలు)లో వెల్లడించినట్లుగా, స్థానిక, గ్లోబల్ సవాళ్లను అర్థం చేసుకోవడం, నావిగేట్ చేయడంచ పరిష్కరించడం ద్వారా పాఠశాల పిల్లలకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం 2020కి కూడా అనుగుణంగా ఉంది.