Governor : టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం

మొదట ఆర్టీసీ బిల్లుపై గవర్నర్  పలు సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదివారం రాజ్ భవన్ కు ఆహ్వానించారు.

Governor approved TSRTC bill (1)

Governor Approved TSRTC Bill : తెలంగాణ ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు ఎట్టకేలకు అమోదం లభించింది. టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చల అనంతరం బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఆర్టీసీ బిల్లుకు తాను వ్యతిరేకం కాదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. గవర్నర్ ఆమోదంతో ఆర్టీసీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం ఇవాళే అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

ఆర్టీసీ బిల్లుపై రాజ్ భవన్ అడిగిన అన్ని సందేహాలకు ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వడంతో చివరికి రూమ్ క్లియర్ అయింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల ఉత్కంఠకు తెరపడటంతో బిల్లును ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజ్ భవన్ లో ఉన్నతాధికారులతో సమావేశమైన గవర్నర్ మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో బిల్లును స్పీకర్ అనుమతితో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

Sunil Kanugolu Survey On T Congress : టీ కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఇవే.. హై కమాండ్ చేతిలో రిపోర్టు

మొదట ఆర్టీసీ బిల్లుపై గవర్నర్  పలు సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదివారం రాజ్ భవన్ కు ఆహ్వానించారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో సమావేశం అయ్యారు. ఆర్టీసీ బిల్లుపై అధికారులను అడిగి గవర్నర్ మరిన్ని వివరాలను తెలుసుకున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై31న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఆగ్టస్టు 3నుంచి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే మనీ బిల్లు కావడంతో గవర్నర్ తప్పనిసరి. దీంతో కేబినెట్ ఆమోదించిన బిల్లును ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపింది.

MLA Rajasingh: వచ్చేసారి నేను ఉండకపోవచ్చు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

కానీ, బిల్లుపై పలు సందేహాలు ఉన్నాయని గవర్నర్ కార్యాలయం ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
ప్రభుత్వం సమాచారం ఇవ్వడం, మళ్లీ గవర్నర్ అదనపు సమాచారం కోరారు. ప్రభుత్వం మరోసారి అదనపు సమాచారం ఇవ్చింది. ఇలా రెండు రోజులు బిల్లుపై ఉత్కంఠ కొనసాగింది. అయితే కావాలనే గవర్నర్ ఆర్టీసీ బిల్లును అడ్డుకుంటున్నారని ఆర్టీసీ కార్మికులు బంద్ కు పిలుపు ఇచ్చారు.

అంతేకాకుండా శనివారం రాజ్ భవన్ ను ముట్టడించారు.  ఈ మేరకు రాజ్ భవన్ కార్యాలయం వివరణ ఇచ్చింది. చివరికి ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైన గవర్నర్.. ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ విలీన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఇవాళే అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.