Graduate MLC Elections
Teachers MLC Elections: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 27వ తేదీన పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఏపీలోనూ రెండు గ్రాడ్యేయేట్, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 29వ తేదీ నాటికి మూడు స్థానాలకు పదవీకాలం ముగియనుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ పదవీకాలం ముగియనుంది. అదేవిధంగా తెలంగాణలో మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పదవీకాలం, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, వరంగల్, కరీంనగర్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది.
Also Read: ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. ఉగాదికి తీపి కబురు చెప్పేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికలు జరిగే జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – ఫిబ్రవరి 10
నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 11
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – ఫిబ్రవరి13
పోలింగ్ తేదీ – ఫిబ్రవరి 27
ఓట్ల లెక్కింపు – మార్చి3