Union Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. సామాన్యులు ఏం ఆశిస్తున్నారో తెలుసా? మీరూ ఇవే కావాలనుకుంటున్నారా?
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్ర సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

Union Budget 2025
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం అవుతాయి. మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.
ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా పలు నిర్ణయాలు ప్రకటిస్తారని అంచనాలు నెలకొన్నాయి. ఆదాయపు పన్ను స్లాబ్‌లు, జీఎస్టీటీ రేట్ల తగ్గింపు వంటి పన్నుల సంస్కరణలను ప్రవేశపెడతారని సామాన్య జనం ఆశగా ఎదురుచూస్తున్నారు.
పన్ను చెల్లింపుదారులు పలు ముఖ్యమైన మార్పులను ఆశిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)పై పన్ను, హౌసింగ్ ప్రయోజనాలతో పాటు సేవింగ్ ఇన్సెంటివ్‌లలో మార్పులు జరగాలన్న సిఫార్సులు ఉన్నాయి. ఆదాయపన్ను పాలసీలో ముఖ్యమైన మార్పులు ఉండవచ్చని అంచనా.
బడ్జెట్‌పై పన్ను చెల్లింపుదారుల అంచనాలు
- ఆదాయపన్ను స్లాబ్‌లో మార్పులు
- ఆదాయపన్ను పరిమితిని రూ.4 లక్షలకు పరిమితి పెంచితే బాగుండని ఆశలు
- ఓవరాల్ ట్యాక్స్ స్లాబ్ పరిమితిని 10 లక్షలు చేయాలని విజ్ఞప్తి
- గృహరుణాల ప్రయోజనాలను కొత్త ట్యాక్స్ రెజీమ్‌కు సైతం వర్తింపచేయాలని కోరిక
- సెక్షన్ 24 బీ కింద గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి సంంధించి రూ.2 లక్షలుగా ఉన్న లిమిట్‌ను రూ.3 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి
- జాతీయ పింఛన్ వ్యవస్థలో ట్యాక్స్ డిడక్షన్ పరిధిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచాలని ప్రతిపాదన
- టైప్-2 సిటీల్లో హెచ్ఆర్ఏ మినహాయింపును 50 శాతం చేయాలని ఆశ
- సెక్షన్ 80 డీ కింద ఆరోగ్య బీమాలో వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు ట్యాక్స్ డిడక్షన్ లిమిట్‌ను రూ.50 వేలకు చేయాలని విజ్ఞప్తి
- అదే సెక్షన్ 80 డీ కింద ఆరోగ్య బీమాలో వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లలోని వృద్ధులకు ట్యాక్స్ డిడక్షన్ లిమిట్‌ను రూ.1 లక్ష చేయాలని విన్నతి
Diabetics: వామ్మో మధుమేహం ఉంటే ఈ ముప్పు కూడా తప్పదట.. పరిశోధనలో వెల్లడి