Diabetics: వామ్మో మధుమేహం ఉంటే ఈ ముప్పు కూడా తప్పదట.. పరిశోధనలో వెల్లడి

మధుమేహం ఉన్నవారిలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి.

Diabetics: వామ్మో మధుమేహం ఉంటే ఈ ముప్పు కూడా తప్పదట.. పరిశోధనలో వెల్లడి

Diabetics

Updated On : January 29, 2025 / 12:43 PM IST

అనారోగ్యకర ఆహారం, జీవనశైలి వల్ల మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మధుమేహం వల్ల ఇతర అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మధుమేహం వల్ల తలెత్తే పోషకాహార లోపంపై తాజాగా అనేక విషయాలు తెలిశాయి.

మధుమేహం ఉన్నవారిలో విటమిన్ డీ లోపం తలెత్తడం సర్వసాధారణమని పరిశోధనలో వెల్లడైంది. మధుమేహం ఉన్నవారిలో 60 శాతం మంది విటమిన్‌ డీ లోపంతో బాధపడే అవకాశం ఉందని “బ్రిటిష్ మెడికల్ జర్నల్” న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్‌లో ప్రచురించిన ఓ పరిశోధనలో పేర్కొన్నారు. 1998, 2023 మధ్య 52,000 మంది నుంచి డేటా తీసుకుని 132 అధ్యయనాలు చేశారు.

Also Read: కుంభమేళాలో తొక్కిసలాటకు కారణం ఏమిటి.. ఎందుకలా జరిగింది.. ఎంతమంది గాయపడ్డారు.. సీఎం యోగి ఏం చెప్పారు..

వాటి ఫలితంగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మధుమేహం ఉన్నవారిలో 42 శాతం మందికి మెగ్నీషియం లోపం ఉందని కూడా తేలింది. అలాగే, మధుమేహం ఉన్నవారిలో 28 శాతం మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని పరిశోధకులు గుర్తించారు.

ఈ పరిశోధన చేసిన వారిలో రాజస్థాన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ పరిశోధకులు కూడా ఉన్నారు. ప్రపంచంలో పోషకాహార లోపం ఏ మేరకు ఉందన్న విషయాన్ని అంచనా వేయడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని చెప్పారు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో విటమిన్లు, ఖనిజాల స్థాయి చాలా తక్కువగా ఉంటున్నాయని వెల్లడైందని తెలిపారు. శరీర పనితీరు మెరుగ్గా ఉండాలంటే అవి చాలా ముఖ్యం.

డయాబెటిస్ పురుషులతో పోల్చితే మహిళలు పోషకాహార లోపానికి గురయ్యే అవకాశం అధికమని చెప్పారు. మధుమేహానికి ప్రధాన కారణాలు జన్యుపర సమస్యలు, పర్యావరణ కారకాలు, శరీర కదలికలు అంతగాలేని జీవనశైలి, అనారోగ్య ఆహారం, స్థూలకాయం అని వివరించారు.

బాబోయ్.. మీ పిల్లలు కూడా గూగుల్‌లో వాటికోసం సెర్చ్ చేస్తున్నారా.. ఈ 17ఏళ్ల బాలిక ఏం చేసిందో తెలుసా?