బాబోయ్.. మీ పిల్లలు కూడా గూగుల్‌లో వాటికోసం సెర్చ్ చేస్తున్నారా.. ఈ 17ఏళ్ల బాలిక ఏం చేసిందో తెలుసా?
మహారాష్ట్ర నాగపూర్ లో 17ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోవడానికి ముందు తన ఫోన్ లో దేనికోసం వెతికిందనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ఆమె ఫోన్ ను పరిశీలించగా..

Girl suicide in Nagpur
Girl suicide in Nagpur : చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది..? ఈ ప్రశ్నకు అనేక రకాలుగా సమాధానాలు వినిపిస్తుంటాయి. చనిపోయిన తరువాత మంచివారు స్వర్గానికి, చెడు పనులు చేసిన వారు నరకానికి వెళ్తారని తరచూ మనం వింటుంటాం. అయితే, ప్రాంతాల వారిగా, ఆయా దేశాల్లో వారు పాటించే ఆచారాల వారిగా చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది అనే ప్రశ్నకు పలు రకాలుగా సమాధానాలు వినిపిస్తుంటాయి. అయితే, ఓ 17ఏళ్ల బాలిక చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటు చేసుకుంది.
Also Read: అక్రమ సంతానమైనా సరే.. వివాహేతర సంబంధం వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
బాలిక ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెళ్లి బాలిక ఫోన్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, విచారణ సమయంలో ఆ బాలిక ఫోన్ లో ఎక్కువగా ఏం చూస్తుండేది అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా షాక్ గురయ్యారు. బాలిక ఫోన్లో లభ్యమైన సమాచారం ప్రకారం.. కొన్నాళ్లుగా బాలిక ఆన్ లైన్ గేమ్స్ కు బానిసగా మారినట్లు గుర్తించారు. అదేవిధంగా గూగుల్ లో చావు గురించి ఎక్కువగా వెతికిందట. విదేశీ సంస్కృతుల గురించీ అదేపనిగా సెర్చ్ చేసింది. ప్రత్యేకించి ఐరోపా ప్రజల సంస్కృతిపై ఆసక్తి ఎక్కువగా ఉన్న ఆమె.. తన డైరీలో విదేశీ సంస్కృతుల గురించి సవివరంగా రాసుకుంది. చావు తరువాత ఏం జరుగుతుందనే దానిపై వెతుకుతూ.. కొన్నివారాలుగా ఆ బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. అయితే, ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు కర్రపడితో కూడిన రాతితో తయారు చేసిన కత్తిని వాడిందట. ఈ తరహా కత్తులు స్థానికంగా లేకపోవటంతో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి కొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాలిక తండ్రి ఆర్బీఐ లో రీజనల్ డైరెక్టర్ పనిచేస్తున్నాడు. బాలిక తల్లి గృహిణి. వారు నాగపూర్ లోని ఛత్రపతి నగర్ లో నివాసం ఉంటున్నారు. మృతురాలు ఆ దంపతులకు ఏకైక సంతానం కావటం గమనార్హం. సోమవారం తెల్లవారు జామున బాలిక పడకగదిలోకి ఆమె తల్లి వెళ్లి చూడగా.. బాలిక రక్తపు మడుగులో కనిపించింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే బాలిక మృతిచెందినట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
బాలిక చనిపోవడానికి ముందు కత్తితో తన మణికట్టు మీద రెండు క్రాస్ మార్కులతో సహా ఐదు గాట్లు పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చివరికి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.