అక్రమ సంతానమైనా సరే.. వివాహేతర సంబంధం వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

నా తండ్రి ఎవరో తేల్చాలంటూ యువకుడు కోర్టును ఆశ్రయించాడు. యువకుడు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

అక్రమ సంతానమైనా సరే.. వివాహేతర సంబంధం వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Supreme Court

Updated On : January 29, 2025 / 10:38 AM IST

Supreme Court: నా తండ్రి ఎవరో తేల్చాలంటూ యువకుడు కోర్టును ఆశ్రయించాడు. నేను నా తల్లికి పుట్టిన అక్రమ సంతానమని నమ్ముతున్నాను.. ఫలానా వ్యక్తి నా తండ్రి అని భావిస్తున్నాను.. డీఎన్ఏ పరీక్ష ద్వారా అతను నా తండ్రోకాదో తేల్చాలని కోరుతూ యువకుడు కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టుల నుంచి హైకోర్టు.. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు ఈ కేసు చేరింది. అయితే, తాజాగా సుప్రీంకోర్టు ఆ యువకుడికి షాకిచ్చింది. ఇది మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత గోప్యంత వ్యవహారం.. అతని అనుమతి లేకుండా డీఎన్ఏ పరీక్షకు ఆదేశించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. పిల్లాడు కడుపులో పడిన సమయంలో సదరు మహిళతో భర్త, మూడో వ్యక్తి ఇద్దరూ కాంటాక్టులో ఉన్నారని భావించినా కుమారుడు మాజీ భర్తకు సక్రమ సంతానమే అవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంతకీ ఈకేసు ఏమిటి.. ఎప్పటి నుంచి నడుస్తుంది.. అనే వివరాల్లోకి వెళితే..

Also Read: Nayanthara : ధనుష్ విషయంలో నయనతారకు, నెట్ ఫ్లిక్స్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..

కేరళలోని కోచికి చెందిన మహిళ తన భర్తతో విడిపోయింది. అప్పటికే ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 1989లో ఆమెకు వివాహం జరిగింది. 1991లో కుమార్తె, 2001లో కుమారుడు జన్మించాడు. 2003లో ఆమె తన భర్తతో విడిపోయింది. అప్పటికే ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధంలో ఉంది. 2006లో ఆమె భర్తతో విడుకులు మంజూరయ్యాయి. విడాకులు మంజూరైన కొద్దిరోజులకే ఆమె కోచి మున్సిపల్ కార్యాలయంకు వెళ్లింది. నా కుమారుడు నా మాజీ భర్తకు జన్మించలేదని.. నా కుమారుడు కడుపులో పడేకంటే ముందునుంచే వేరేవ్యక్తితో వివాహేతర సంబంధం కలిగిఉన్నానని.. తన కుమారుడి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంలో తండ్రిపేరు మార్చాలని మున్సిపల్ అధికారులను కోరింది. అధికారులు అందుకు నిరాకరించారు. దీంతో 2007లో స్థానిక కోర్టును ఆశ్రయించింది.

Also Read: Meerpet Madhavi Case: మీర్ పేట్ మాధవి కేసులో గురుమూర్తి అరెస్ట్.. పోలీసులే ఆశ్చర్యపోయే విషయాలు..

నేను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని నా కుమారుడికి తండ్రి అని నిర్దారించాలని స్థానిక కోర్టును కోరగా.. మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి, పిల్లాడికి డీఎన్ఏ పరీక్ష చేయాలని ఆదేశించింది. దీనిపై వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, హైకోర్టులో ఆ మహిళకు చుక్కెదురైంది. పిల్లాడు కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపించగలిగితే వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి డీఎన్ఏ పరీక్ష చేసుకోవాలని ఆదేశించగలమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కుమారుడు 2015లో కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. తనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయని, ఆ ఖర్చులను తన తల్లి భరించలేక పోతుందని, తనకు చట్టబద్దమైన (మా తల్లి విడాకులు ఇచ్చిన) తండ్రి నుంచి కూడా సహకారం లేదని పిటీషన్ లో యువకుడు పేర్కొన్నాడు. తన వైద్యం, చదువు ఖర్చుకోసం మూడో వ్యక్తి (నా తల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్న) నుంచి భృతి ఇప్పించాలని పిటీషన్ లో కోర్టును కోరాడు. దీంతో యువకుడికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది.

 

కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో అతనికి చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిస్తూ యువకుడికి షాకిచ్చింది. పిల్లాడు కడుపులో పడిన సమయంలో సదరు మహిళతో భర్త, మూడో వ్యక్తి ఇద్దరూ కాంటాక్టులో ఉన్నారని భావించినా కుమారుడు మహిళ మాజీ భర్తకు సక్రమ సంతానమే అవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.