Nayanthara : ధనుష్ విషయంలో నయనతారకు, నెట్ ఫ్లిక్స్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..

తాజాగా ధనుష్ నయనతార కేసులో నెట్ ఫ్లిక్స్ కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది.

Nayanthara : ధనుష్ విషయంలో నయనతారకు, నెట్ ఫ్లిక్స్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..

Madras High Court Dismissed Netflix Petition in Dhansuh Nayanthara Case

Updated On : January 28, 2025 / 4:41 PM IST

Nayanthara : ఇటీవల కొన్ని రోజుల క్రితం నయనతార డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ తో వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ధనుష్ నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలోని సన్నివేశాలను నయనతార ధనుష్ పర్మిషన్ లేకుండా వాడుకోవడంతో ధనుష్ డబ్బులు కట్టాలని లీగల్ నోటీసులు పంపించడం, దానికి నయనతార సీరియస్ అయి ఫైర్ అవ్వడం చేసింది. తాజాగా ఈ కేసులో నెట్ ఫ్లిక్స్ కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది.

నయనతార తన డాక్యుమెంటరీలో నేను రౌడీని సినిమా విజువల్స్ వాడుకోవడంతో ధనుష్ నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు పంపడమే కాకుండా నయనతార దంపతులపై, వాళ్ళ నిర్మాణ సంస్థపై మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. అయితే ధనుష్ దావాను సవాల్ చేస్తూ ఆ డాక్యుమెంటరీని నిర్మించిన నెట్ ఫ్లిక్స్ ఓ పిటిషన్ ని దాఖలు చేసింది. తాజాగా ఆ నెట్ ఫ్లిక్స్ పిటిషన్ ని విచారించిన కోర్టు దాన్ని కొట్టేసింది. దీంతో నెట్ ఫ్లిక్స్, నయనతారకు ఈ విషయంలో హైకోర్టు షాక్ ఇచ్చింది.

Also Read : Rajamouli : మహేష్, ప్రియాంకతో సహా.. వాళ్ళందరి దగ్గర.. ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు తీసుకున్న రాజమౌళి?

అసలు వివాదం ఏంటి..

ఇటీవల నెట్ ఫ్లిక్స్ నయనతార డాక్యుమెంటరీని నిర్మించింది. ఇందులో నయనతార సినిమాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగింది, తాను ఎదుర్కున్న కష్టాలు ఏంటి, తన ప్రేమ, పెళ్లి గురించి చూపించారు. ఈ డాక్యుమెంటరీలో నయన్ నటించిన పలు సినిమా విజువల్స్, మేకింగ్ విజువల్స్ చూపించారు. అయితే నయనతార – తన భర్త విగ్నేష్ శివన్ మొదటిసారి పరిచయమై ప్రేమలో పడింది నేను రౌడీనే సినిమా సమయంలో. ఈ సినిమాని ధనుష్ నిర్మించాడు. ఈ సినిమా విజువల్స్ ధనుష్ పర్మిషన్ లేకుండా డాక్యుమెంటరీలో వాడటంతో ధనుష్ వీరికి పది కోట్లు కట్టాలని లీగల్ నోటీసులు పంపించాడు.

Also See : పంజా డైరెక్టర్ కొత్త సినిమా ‘ప్రేమిస్తావా’ ట్రైలర్ చూశారా? బ్రేకప్ చెప్పిన ప్రియురాలిని కాపాడటానికి..

దీంతో ధనుష్ పై నయనతార ఫైర్ అయి తన సోషల్ మీడియాలో.. విజువల్స్ వాడుకోడానికి నిన్ను పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు. నాకు – విగ్నేష్ కి ఆ సినిమా స్పెషల్ కాబట్టి వాడుకున్నాము. నువ్వు అందర్నీ ఇబ్బంది పెడతావు, ఆ సినిమా సమయంలో మమల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టావు. నిన్ను నీ ఫ్యాన్స్ మంచివాళ్ళు అనుకుంటారు. కానీ నీ అసలు రూపం ఎవ్వరికి తెలీదు. మూడు సెకండ్స్ కే ఇలా నోటీసులు పంపిస్తావా అంటూ తీవ్రంగా విమర్శలు చేసింది ధనుష్ పై. అయితే డాక్యుమెంటరీలో ఆల్మోస్ట్ ముప్పై సెకండ్స్ వాడుకోవడంతో ధనుష్ ఫ్యాన్స్ నయనతార పై విమర్శలు చేసారు. నయనతార విజువల్స్ తీయకపోగా ఇలా ధనుష్ పై విరుచుకుపడడంతో ధనుష్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది.