Meerpet Madhavi Case: మీర్ పేట్ మాధవి కేసులో గురుమూర్తి అరెస్ట్.. పోలీసులే ఆశ్చర్యపోయే విషయాలు..
గురుమూర్తికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు.

Gurumurthy, Venkata Madhavi
Meerpet Madhavi Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మీర్ పేట్ మాధవి కేసుకు సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. గురుమూర్తి ఎంత కిరాతకుడో తెలిపారు. ఈ కేసులో అసలేం జరిగింది అనేది పాయింట్ టు పాయింట్ వివరించారు పోలీసులు.
నరరూప రాక్షసుడు, ఏమాత్రం పశ్చాత్తాపం లేదు..
”గురుమూర్తికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు. ప్రకాశం జిల్లాకి చెందిన గురుమూర్తి, వెంకట మాధవి జిల్లెలగూడలో ఉంటున్నారు. భార్యను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే.. ముందస్తుగా తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచి వచ్చాడు. ఉద్దేశ పూర్వకంగానే భార్య మాధవితో గొడవ పెట్టుకున్నాడు.
Also Read : డీప్‌సీక్ ఏఐ.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ చైనా స్టార్టప్ కంపెనీ గురించి 10 ఆసక్తిర విషయాలివే
పిల్లలకి తల్లిపై లేనిపోని మాటలు చెప్పాడు..
వెంకట మాధవిని కొట్టాడు. గోడకు వేసి అదిమాడు. మాధవిపైన కూర్చుని.. గొంతు నులిమాడు. ఊపిరి ఆగిపోయేంత వరకు గొంతు నులిమాడు. హత్య చేసి.. బూడిద చేసి.. చెరువులో పారవేసిన తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాడు. పిల్లలకి తల్లిపై లేనిపోని మాటలు చెప్పాడు. మీ మమ్మీ నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. అత్త, మామలకు కూడా ఇదే విషయం చెప్పాడు.
ఆ బెడ్ రూమ్ వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు..
మాధవిని చంపిన గురుమూర్తి డెడ్ బాడీని ముక్కలు చేశాడు. వాటిని నీళ్లలో వేసి హీటర్ తో ఉడికించాడు. ఉడికించిన ముక్కలను స్టవ్ పై కాల్చాడు. ఆ తర్వాత ఎముకలను పొడి చేశాడు. అదేరోజు సాయంత్రం పెయింట్ బకెట్ లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు. ఇంట్లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశాక పిల్లలను తీసుకొచ్చాడు.
హత్య చేసిన బెడ్ రూమ్ వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు. అమ్మ ఏది అని పిల్లలు అడిగితే ఎక్కడికి వెళ్లిందో తెలియదని చెప్పాడు. ఇలా రెండు రోజులు గడిచాయి. ఆ తర్వాత వెంకట మాధవి తల్లిదండ్రులు వచ్చి అడిగారు. చివరికి మాధవి తల్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేశాం.
ఆధారాలు దొరికిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు..
గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత.. విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఆధారాలు దొరికిన తర్వాత కూడా.. తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు” అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.
Also Read : ఇండియాపై అమెరికా టారిఫ్ బాంబ్.. ట్రంప్ సంచలనం..?
దర్యాప్తులో అతడు చెప్పిన విషయాలు విని మేమే నివ్వెరపోయాం..
హైదరాబాద్ మీర్ పేటలో భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. మీడియాతో మాట్లాడిన రాచకొండ సీపీ సుధీర్ బాబు.. వెంకట మాధవిని గురుమూర్తి అత్యంత క్రూరంగా చంపాడని వెల్లడించారు.
ఆర్మీలో పని చేసి రిటైర్ అయిన గురుమూర్తి.. దర్యాప్తులో చెబుతున్న విషయాలు విని తామే నివ్వెరపోయామన్నారు సీపీ సుధీర్ బాబు. ఈ కేసులో ఎవిడెన్స్ సేకరించేందుకు తాము తీవ్రంగా శ్రమించామన్నారు సీపీ సుధీర్ బాబు.