US Tariffs: ఇండియాపై అమెరికా టారిఫ్ బాంబ్.. ట్రంప్ సంచలనం..?
ఇండియా మీద భారం మోపడానికి ట్రంప్ సిద్ధమైనట్టు కనిపిస్తోంది..

PC:ANI
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద భారీ భారం మోపడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కొన్ని దేశాల వల్ల అమెరికాకు నష్టం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. వైట్ హౌస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘కొన్ని దేశాల వల్ల మనకి నష్టం జరుగుతుంది. చైనా చూడండి వారి మీద భారీ టారిఫ్ విధించొచ్చు. అలాగే, ఇండియా, బ్రెజిల్ కూడా. వాళ్లు వాళ్ల దేశం బావుండాలని చూసుకుంటున్నారు. దాని వల్ల అమెరికాకి నష్టం జరుగుతుంది. దీన్ని నేను అంగీకరించను.
Also, Read: ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని నరేంద్ర మోదీ..! స్వయంగా వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా మళ్లీ రిచ్ అవ్వాలి. వీలైనంత త్వరగా. అమెరికానే మనకి ఫస్ట్ ప్రయారిటీ‘ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇండియా మీద భారం మోపడానికి ట్రంప్ సిద్ధమైనట్టు కనిపిస్తోంది. మరోవైపు ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు ఆకాంక్షించారు. అదే సమయంలో మోదీని ట్రంప్ వైట్ హౌస్ కి ఆహ్వానించారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ట్రంప్.. బహుశా ఫిబ్రవరిలో మోదీ అమెరికా రావొచ్చని చెప్పారు.