Ameerpet ISKP..ATS
Gujarat ATS officials search in Telangana : కోచింగ్ సెంటర్లకు కేరాఫ్ అడ్డాగా ఉన్న అమీర్ పేటలో గుజరాత్ ఏటీఎస్ సోదాలు నిర్వహిస్తోంది. అమీర్ పేటలో కోచింగ్ సెంటర్ల ముసుగులో ఉగ్రవాద శిక్షణలు ఇస్తున్నారనే అనుమానాలు రావటంతో ఏటీఎస్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కోచింగ్ సెంటర్లలో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లుగా ఏటీఎస్ అధికారులు అనుమానిస్తున్నారు. దీంట్లో భాగంగానే అమీర్ పేటలోని పలు కోచింగ్ సెంటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం (జూన్ 27,2023) పాతబస్తీలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని కాలాపతర్ లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని అధికారులు విచారిస్తున్నారు. సయ్యద్ హజీబుల్లా,నజీ అనే ఇద్దరుఅనుమానితులనుఅదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు. కాలాపత్తర్ లో మెడికల్ షాపు నిర్వహిస్తున్న ఫజీబుల్లా అనే వ్యక్తి స్టేట్ మెంట్ ను ఏటీఎస్ అధికారులు రికార్డు చేశారు. షజీబుల్లా ఇప్పటికే ఓ కేసులో సాక్షిగా ఉన్నాడు. అతనితో పాటు సయ్యద్ ను కూడా విచారిస్తున్నారు. అలాగే వరంగల్ లోని పెద్దపల్లిలో కూడా గుజరాత్ ఏటీఎస్ అధికారులు సోదాలు జరిపారు.
మాడ్యుల్ ఆధారంగా ఏటీఎస్ అధికారులు హైదరాబాద్, వరంగల్, పెద్దపల్లిల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీలో తండ్రీ కూతుళ్లను, అలాగే వరంగల్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా జూన్ 10న గుజరాత్ ఏటీఎస్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ లో ఐఎస్ కేపీ మాడ్యుల్ వెలుగు చూసింది. ఉగ్ర కదలికలు అనుమానంతో అదుపలోకి తీసుకున్నవారంతా ISKP ( Islamic State Khorasan Province)లో చేరేందుకు యత్నిస్తున్నట్లుగా సమాచారం. పోర్ బందర్ లో పలువురిని అరెస్ట్ చేయగా వారంతా ISKP చేరటానికి యత్నిస్తున్నట్లుగా ఇంజెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. వీరంతా పడవల ద్వారా దేశం దాటాలనుకుంటున్నవారికి సహాయసహకారాలు అందిస్తున్నారు. ISKP ఉగ్రవాద కార్యకలాపాలు నిర్విహించాలని సుబేరా భాను కుట్ర చేస్తున్నారని తేలింది. శ్రీనగర్ కు చెందిన నాసిర్, హయత్, అజీమ్ లనే ఉగ్రవాదులతో సుబేరా భానుకు సంబంధాలున్నాయి.
తెలంగాణలో మరోసారి ఉగ్ర కదలికలు వెలుగుచూశాయి. గుజరాత్ లోని సముద్రమార్గం ద్వారా పలడవల్లో సరిహద్దులు దాటేందుకు యత్నిస్తున్న టెర్రరిస్టులను ఏటీఎస్ బందాలు అరెస్ట్ చేసి విచారిస్తున్నాయి. అలా అరెస్ట్ చేసినవారికి ఉన్న లింకులు తెలంగాణలో బయటపడ్డాయి. దీంతో.. నిఘా పెట్టిన ఏటీఎస్ బృందాలకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం (27 తేదీన) రాత్రి హైదరాబాద్ లోని అమీర్ పేటతో పాటు పలు ప్రాంతాల్లోను, అలాగే పెద్దపల్లి జిల్లా లోను తనిఖీలు నిర్వహించారు. టెర్రరిస్టులతో సంబంధం ఉన్నట్టు అనుమానాలతో మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో పాటు.. ఆయన కూతుర్ని కూడా గుజరాత్ ఏటీఎస్ బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిని ప్రత్యేక భద్రత నడుమ హైదరాబాద్‌లోని ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
విచారణలో భాగంగా మహ్మద్ జావీద్ నాలుగేళ్లుగా హైరాబాద్‌లోని టోలీచౌకీలో నివాసముంటున్నాడని తేలింది. అమీర్‌పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ట్రైనర్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. బక్రిద్ పండుగ సందర్భంగా జావీద్ తన కుమార్తెతో కలిసి గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాడనే పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎస్ బృందాలు తనిఖీలు చేసి వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఏటీఎస్ బృందాలు రంగంలోకి దిగి అరెస్ట్ చేశాయి. వారు టెర్రరిస్టులతో వాట్సప్ చాటింగ్ కూడా చేసినట్టుగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పేలుళ్లతో కూడా సంబంధం ఉందన్న కోణంలోనూ విచారించనున్నారు.
Kamareddy District : రూ.3లక్షలకే కిలో బంగారు హారం.. ఆఫర్ అదుర్స్ కదూ.. కట్ చేస్తే