Harish Rao : చెప్పేందుకు విషయం లేకనే బూతులు.. చంద్రబాబు స్పందించినా.. ఇక్కడి సీఎం స్పందించలేదు.. రేవంత్ పై హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
Harish Rao : ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని.. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు అతని వద్ద విషయం లేకనే బూతులు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.
- Harish Thanniru
- Published on- July 12, 2026 / 02:43 PM IST
HarishRao Fires On CM Revanth Reddy
Harish Rao : ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని.. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు అతని వద్ద విషయం లేకనే బూతులు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.. ఈ సందర్భంగా రేవంత్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Kaleshwaram Water : కాళేశ్వరం నీళ్లపై తెలంగాణలో రాజకీయ రగడ.. మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం..
మేడిగడ్డ వద్ద నీళ్లు ఎత్తిపోయవచ్చునని విశ్రాంత ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా.. ఎందుకు ఎత్తిపోయట్లేదని హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎంగా రెండున్నరేళ్లు పూర్తవుతున్నా.. రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన రాలేదని అన్నారు. రైతులకు నీళ్లిచ్చే ప్రయత్నం చేకుండా.. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని.. వాస్తవాలు మాట్లాడిన వారిని జైలులో పెడతానంటూ భయపెడుతున్నారంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలకు పోయి కరువు సమస్యను జఠిలం చేయొద్దని, నీళ్ల విషయంలో ఇష్టం వచ్చినట్లు చేస్తుంటూ ఊరుకునేది లేదని హరీశ్ రావు హెచ్చరించారు. మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి అన్నీ అవాస్తవాలే చెబుతున్నారన్న హరీశ్ రావు.. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లివ్వమంటే విపక్షాల కంఠం నొక్కుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, హిట్లర్ తనకు ఆదర్శమని గతంలో రేవంత్ చెప్పాడని.. అందుకే హిట్లర్ తరహాలో మాట్లాడుతున్నాడని.. చివరికి హిట్లర్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. షాబాద్ ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించినా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని హరీశ్ రావు అన్నారు.
