Harish Rao: దీని అర్థం మీ మ్యానిఫెస్టో తప్పు అనే కదా?: హరీశ్ రావు

అందరినీ తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆయన పదవి కోసం ఎవరిని అయినా..

పార్టీలు మారిన వారిపై తక్షణమే అనర్హత వేస్తామంటూ మ్యానిఫెస్టోలోని అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభలో వివరించి చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డేమో పార్టీలు మారిన వారికి కండువాలు కప్పుతున్నారని హరీశ్ రావు చెప్పారు. దీని అర్థం కాంగ్రెస్ మ్యానిఫెస్టో తప్పు అనే కదా? అని అన్నారు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదని తెలిపారు. మాటమీద నిలబడే నైజం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు.

మైనార్టీలు క్యాబినెట్లో లేకుండా ప్రభుత్వం నడుపుతున్నది రేవంత్ సర్కారేనని హరీశ్ రావు చెప్పారు. అందరినీ తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆయన పదవి కోసం ఎవరిని అయినా తొక్కుతారని విమర్శించారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన పడిందని, రేవంత్ రెడ్డి రైతులను కలవలేదని చెప్పారు.

వెంటనే రైతుల పంటలు కొనుగోలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ స్థాయికి తగ్గట్లుగా మాట్లాడడం లేదని అన్నారు. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చచ్చుబడేది ఖాయమని అన్నారు.

Also Read: కేసీఆర్ జైలుకే అన్నారు.. మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? సీఎం రేవంత్ పై రఘునందన్ ఫైర్

ట్రెండింగ్ వార్తలు