Harish Rao: అప్పుడే నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాను: హరీశ్ రావు

రేవంత్ రెడ్డి తన ఛాలెంజ్ ను స్వీకరించాలని చెప్పారు. 100 రోజులలో ఆరు..| CM Revanth Vs Harish Rao

Harish Rao: అప్పుడే నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాను: హరీశ్ రావు

Harish Rao

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్ కాలం చెల్లిందని, ఆ పార్టీ నేతలకు శిక్ష పడాలని హరీశ్ రావు చెప్పారు. అన్ని గ్యారంటీలు అమలు చేయాలని, అప్పుడు తాను స్వచ్ఛందంగా స్పీకర్‌కు రాజీనామా లేఖ అందిస్తానని తెలిపారు.

జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట పేరు లేకుండా అవార్డులు లేవని అన్నారు. అసలు సిద్దిపేటకు బీఆర్ఎస్ ఏం చేయలేదో చెప్పాలని హరీశ్ రావు సవాలు విసిరారు. సిద్దిపేటకు మెడికల్ కాలేజీతో పాటు రైలు, ఐటీ హబ్ ఎలా ఎన్నో రకాల అభివృద్ధి పథకాలు అమలు చేశామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చింది సిద్దిపేటేనని చెప్పారు. సీమాంధ్ర నేతల కుట్రలను సిద్దిపేట తిప్పికొట్టిందని తెలిపారు.

సిద్దిపేట లేపోతే తెలంగాణ ఉద్యమం లేదని హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డికి మతి మరుపు ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి లాగా పదవులకోసం చిల్లర రాజకీయాలు చేయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తన ఛాలెంజ్ ను స్వీకరించాలని చెప్పారు. 100 రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలని, అలా చేస్తే తాను రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానము చేస్తానని అన్నారు.

 

ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు.. విఠల్ స్పందన