బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు.. విఠల్ స్పందన

Dande Vithal: ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు.. విఠల్ స్పందన

Dande Vithal

Updated On : May 3, 2024 / 3:46 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దండె విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేసింది. దండె విఠల్‌కు 50 వేల రూపాయల జరిమానా విధించింది. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఇవాళ తీర్పు చెప్పింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.

అయితే, ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తాను నామినేషన్ ను ఉపసంహరించుకోలేదని చెప్పారు. ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక వివాదంపై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.

రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ ఉపసంహరణ పేపర్లను కేంద్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపారు. చివరకు అందులోని సంతకాలు నకిలీవని తేలింది. దండె విఠల్‌ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని హైకోర్టును రాజేశ్వర్‌రెడ్డి మొదటి నుంచి కోరుతున్నారు. ఇవాళ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

సుప్రీంకోర్టులో సవాల్ చేస్తా: విఠల్
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విఠల్ స్పందిస్తూ.. ఈ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. ఇతర పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ సరిగ్గా జరగలేదన్న కారణంతోనే ఈ తీర్పు వచ్చిందన్నారు. ఆ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణకు, తనకు సంబంధంలేని వ్యవహారమని తెలిపారు. ఈ తీర్పును సవాలు చేసేందుకు 4 వారాల గడువు ఉందని చెప్పారు.

రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ నామినేషన్ దాఖలు.. కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి రోడ్ షో