మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాజీ మంత్రి హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. అనంతరం చర్లపల్లి జైల్ వద్ద హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నారని అన్నారు.
అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడితే బీఆర్ఎస్ కుట్ర అన్నారని, రైతులు రోడ్ల మీదకు వస్తే బీఆర్ఎస్ కుట్ర అని అంటున్నారని, పోలీసులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటున్నారని చెప్పారు. గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే బీఆర్ఎస్ కుట్ర అన్నారని తెలిపారు.
చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందంటున్నారని చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభం అయ్యిందని చెప్పారు. తమ భూములు తమకు కావాలని లగచర్ల ప్రాంత ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు.
రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడటం లేదని నిలదీశారు. గూండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓటు వేసి గెలిపిస్తే బాగు పడతాం అని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొట్టారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం నరేందర్ రెడ్డి చేశారని, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నయో వారికి అండదండగా ఉండటం ప్రతిపక్షం బాధ్యత అని చెప్పారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణరాజు ఎన్నిక.. బాధ్యతల స్వీకరణ