Hyderabad Rains : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు..

Heavy rain in Hyderabad : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రాత్రి భారీ వర్షం కురుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Heavy rain in Hyderabad

Hyderabad Rains : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయంత్రం, రాత్రి వేళల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నగర వాసులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సీపీ వీసీ సజ్జనార్ నగర వాసులకు ట్విటర్ వేదికగా కీలక సూచనలు చేశారు.

Also Read : Telangana Govt : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. వారందరికీ ఉచిత ప్రవేశం..

‘నగరంలో ఇవాళ రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే‌లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి. ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి’ అంటూ సజ్జనార్ ట్వీట్ లో పేర్కొన్నారు.