Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. ఈదురుగాలులతోపాటు వడగళ్లవాన

హైకోర్టు, నాంపల్లి, ఆబిడ్స్, హిమాయత్ నగర్, కోఠిలో వడగండ్ల వాన పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసింది.

Heavy Rain

Heavy Rain : హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం ఓ రేంజ్ లో ఎండ దంచికొడితే సాయంత్రం అయ్యే సరికి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నగరంంలోన పలు ప్రాంతాల్లో వర్షం కుమ్మేస్తోంది. ఈదురుగాలులతోపాటు వడగళ్ల వర్షం కురిసింది. హైకోర్టు, నాంపల్లి, ఆబిడ్స్, హిమాయత్ నగర్, కోఠిలో వడగండ్ల వాన పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసింది.

నగరంలోఉదయం అధికంగా ఎండ కొట్టింది. సాయంత్రం చల్లబడి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఓల్డ్ సిటీ ప్రాంతంలో వడగళ్ల వాన పడింది. మిగిలిన ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఉండే పెద్ద పెద్ద చెట్లు విరిగిపడే అవకాశం ఉంది. భారీ వర్షంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Rain in Hyderabad : హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం.. చల్లబడిన వాతావరణం

రోడ్లపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది.  ప్రధానంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటంతో ఇలాంటి వర్షాలు వస్తాయని చెబుతున్నరారు. ఎండాకాలం ఎక్కువ ఎండలు కొట్టడం వల్ల వర్షాలు కురుస్తాయిన వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. గంట వ్యవధిలో 8 నుంచి 9, 10 సెంటి మీటర్ల వర్షపాతం నమోదవుతుంది.