Hyderabad Rains: సైబరాబాద్ అలెర్ట్.. నేడు భారీ వర్షాల సూచన.. వాహనదారులకు హెచ్చరికలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు భారీ వర్షాలు (Hyderabad Rains)కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Heavy rain in Hyderabad today Meteorological Department issues warning

  • నేడు భారీ వర్షాల హెచ్చరిక.
  • ఐటీ ఉద్యోగులకు ముందస్తు సెలవు.
  • వాతావరణ శాఖ హెచ్చరికలు

Hyderabad Rains: హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు సాయంత్రం నుండి మోస్తరు నుండి భారీ వర్షాలు (Hyderabad Rains)కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో పోలీసులు తీవ్రంగా అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవడం, తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే ప్రమాదం ఉన్నందున సైబరాబాద్ పోలీసులు ముందస్తుగా ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. వర్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరియు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.

UIDAI: ఆధార్ హోల్డర్లకు గుడ్ న్యూస్.. ఆరునెలల పాటు ఈ సేవలు ఉచితం

ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్‌లోని ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేట్ సంస్థలు మరియు విద్యాసంస్థలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. రోడ్లపై ఒకేసారి వాహనాల ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా మధ్యాహ్నం 3:30 గంటల నుంచే దశలవారీగా ఉద్యోగులకు ‘ఎర్లీ లాగౌట్’ (ముందస్తు సెలవు) కల్పించాలని కంపెనీల యాజమాన్యాలను విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ నియంత్రణలోకి రావడమే కాకుండా, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కారు డ్రైవర్లు రోడ్లపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులకు సహకరించాలని కోరారు. సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలు అమలు చేస్తున్నామని, వాతావరణ మార్పులను బట్టి తదుపరి సూచనలు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.