×
Ad

అందుకే హైదరాబాద్‌ సహా అన్ని నగరాల్లో కుండపోత వర్షాలు..: రేవంత్‌ రెడ్డి

"నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు" అని చెప్పారు.

Revanth Reddy: వాతావరణ మార్పుల వల్ల నగరాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌లో కూడా అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయని అన్నారు.

గంటలో 2 సెంటీమీటర్ల వర్షం పడితే నగరం అస్తవ్యస్థం అవుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలని చెప్పారు.

Also Read: పవన్‌తో వీవీ లక్ష్మీనారాయణకు ఎక్కడ గొడవొచ్చింది? జనసేనలో జై భారత్ పార్టీ విలీనం కాబోతోందా?

“నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు. కొంతమందికి అర్థమైనప్పటికీ వాళ్లు చేసే కబ్జాలు భవిష్యత్తులో సాగవని మాపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఒక సంకల్పంతో ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి.

వాటిని సమయస్ఫూర్తితో, సమయం, సందర్భాన్ని బట్టి ఎదుర్కోవాలి. కరోనా తర్వాత పర్యావరణంలో చాలా మార్పులు వచ్చాయి. క్లైమేట్ చేంజెస్ వచ్చాయి. అంటే వాతావరణంలో ఊహించనంత మార్పులు వచ్చాయి. ఈ హైదరాబాద్ నగరమే కాదు.. దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, నిర్మించుకున్న రోడ్లు, డ్రైనేజ్ అన్నీ కూడా రోజుకి 2 సెంటీమీటర్ల వర్షం పడితే సరిపోయే విధంగా ఉన్నాయి.

గతంలో వర్షాలను బట్టి ఆనాడు ప్రభుత్వాలు ఇటువంటి నిర్మాణాలు చేశాయి. రోజుకి రెండు సెంటీమీటర్ల వర్షం పడితే ఎదుర్కోవడానికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేసుకున్నాం. కానీ, ఈ మధ్యకాలంలో 2 సెంటీమీటర్ల వర్షం రోజులో కాదు.. ఒకే ఒక్క గంటలో పడుతోంది” అని చెప్పారు.