Site icon 10TV Telugu

Heavy Rains: జాగ్రత్త.. మరో 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Hyderabad Rains

Hyderabad Rains

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీని నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్‌లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నల్గొండ, నాగర్‌కర్నూలు, వనపర్తి, యాదాద్రి, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Also Read: హస్తం పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఎంత స్ట్రాంగ్? కొండా సురేఖ, ఓరుగల్లు ఎమ్మెల్యేల పంచాయితీలో తేల్చిందేంటి?

మరోవైపు, నిన్న హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి రహదారులపై భారీగా నీరు నిలిచింది. అధికారిక డేటా ప్రకారం గురువారం రాత్రి 8 గంటల సమయానికి జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక వర్షపాతం ఖజాగూడా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ గచ్చిబౌలి– 13.15 మి.మీ., శ్రీనగర్‌ కాలనీ – 111.3 మి.మీ., సీఈఎస్ఎస్‌ – 108.5 మి.మీ., సరూర్‌ నగర్‌ – 106 మి.మీ., యూసుఫ్‌గూడ – 104 మి.మీ., జీహెచ్ఎంసీ జోనల్‌ ఆఫీస్‌ ఉప్పల్‌ – 95.5 మి.మీ., ఎల్బీ నగర్‌ – 93 మి.మీ., బంజారాహిల్స్‌ – 90.5 మి.మీ., నాగోల్‌ – 85.5 మి.మీ., బండ్లగూడ – 83.3 మి.మీ., గోల్కొండ – 79.5 మి.మీ.లో నమోదైంది.

Exit mobile version