Patnam Narender Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

హైకోర్లులో నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక ..

Patnam Narender Reddy

Patnam Narender Reddy: లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, జైలులో తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారేక్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

 

హైకోర్టులో నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారేక్ ఇవ్వాలని, ఇంటి భోజనంను అనుమతించాలని హైకోర్టు జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించింది.