Hc fire at T.govt : ప్రాణాలు పోతుంటే సరిహద్దుల్లో అంబులెన్సులు ఆపడమేంటీ? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

High Court Fire At Government Ambulance Stop Issue

High court fire at government ambulance stop Issue : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపు అంటే మే 12,2021 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా హైకోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఎందుకు ఆపివేస్తున్నారు? అని ఏజీని ధర్మాసనం ప్రశ్రించింది. ఓ పక్క జనాలు కరోనా సోకి ప్రాణాలు పోతుంటే అంబులెన్స్ లను ఆపివేయటమేంటీ? అని ఆగ్రహం వ్యక్తంచేసింది.

కాగా ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆర్ ఎంపీ డాక్టర్లు రాసి ఇచ్చిన ప్రిస్ర్కిప్షన్లతో తెలంగాణ రాష్ట్రానికి జనాలు భారీగా తరలి వస్తున్నారనీ..అందుకే అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపివేస్తున్నట్లుగా ఏజీ కోర్టుకు తెలిపారు. ఏజీ ఇచ్చిన సమాధానానికి ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తంచేస్తూ..‘హైదరాబాద్ మహా నగరం ఒక మెడికల్ హబ్..చికిత్స కోసం ఎంతోమంది ఇక్కడకు వస్తుంటారు…ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చికిత్స కోసం నగరానికి వచ్చేవారిని రావద్దని ఎలా చెబుతారు? అని ప్రశ్నించింది. చికిత్స కోసమే కదా? వారి వచ్చేది అటువంటివారిని ఎలా అడ్డుకుంటారు? కేర్, అపోలో ఆస్పత్రుల్లో అంతర్జాతీయ పేషెంట్లు ఉంటారు. వారిని కూడా అడ్డుకుంటారా? అని ప్రశ్నించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డుకునే విషయంలో రేపటిలోగా ఏదోక నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు ఏజీ తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చిన ధర్మాసనం కేసు విచారణను మే 17కు వాయిదా వేసింది.

దానికి కూడా ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తంచేస్తూ..రేపటి వరకూ రోగులు వేచి చూడాలా? ఈలోగా వారి ప్రాణాలు పోతే బాద్యత ఎవరిది? వారి కుటుంబాలకు సమాధానం ఎవరు చెబుతారు? వారి గతి ఏంటీ అని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ప్రశ్నించింది. కాగా..హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా మారడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని 45శాతం కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవే. దీంతో నిన్నటి నుంచి ఆస్పత్రుల్లో అడ్మిషన్ హామీలేని ఇతర రాష్ట్రాల కరోనా బాధితులను తెలంగాణ పోలీసులు బోర్డర్‌లోనే ఆపేశారు. హైదరాబాద్‌లో బెడ్‌ కన్‌ఫర్మేషన్ ఉన్న అంబులెన్స్‌లను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

ఏపీ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కువగా కరోనా బాధితులు వస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ముప్పు ఏర్పడకుండా కొన్ని ఆంక్షలను పెట్టింది. వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు కోవిడ్ పేషెంట్లు క్యూ కడుతున్నారు. మెరుగైన వైద్య సౌకర్యారులు ఉండటంతో.. రోడ్డు మార్గంలోనే కాకుండా.. ఎయిర్ అంబులెన్సుల్లో కూడా బాధితులు హైదరాబాద్‌కు వస్తున్నారు.