Barrelakka..TS HC
barrelakka..TS HIgh Court : బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని హైకోర్టుఆదేశించింది. తనకు భద్రత కావాలని కోరుతు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బర్రెలక్క విన్నపాన్ని ధర్మాసనం అంగీకరించింది. ఆమెకు భద్రత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని.. త్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దే అని వ్యాఖ్యానించింది. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తామంటే కుదరదని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ డిజిపి, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుని బర్రెలక్కకు ఒక గన్ మెన్ తో భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, బర్రెలక్క గా ఫేమస్ అయిన శిరీష తనకు భద్రత కావాలని కోరుతు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. 2+2 భద్రత కావాలని కోరుతు పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన హైకోర్టు ఆమెకు భద్రత కల్పించాలని ఆదేశించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గా ఫేమస్ అయిన శిరీష్ అనే యువతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గేదెలు కాస్తూ ఆమె తీసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచింపజేశాయి. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఆమె ఒక్క వీడియోతోనే ఫేమస్ అయ్యింది. అప్పటినుంచే తనకు కష్టాలు, బెదిరింపులు మొదలయ్యాయని ఆమె వాపోతోంది. పలు ఇంటర్వ్యూల్లో ఆమె అదే చెబుతోంది.
Also Read : బర్రెలక్కకే మా మద్దతు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
తాజాగా ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మరోసారి వైరల్ అవుతోంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన తన కోసం తన కుటుంబం కోసం పోరాడుతున్నానని చెబుతున్న బర్రెలక్క తనదైన రీతిలో ప్రచారంలో ముందుకు సాగుతూ ఓటర్లను ఆకర్షిస్తోంది. ఆమెకు ఎంతోమంది మద్దతుగా నిలవటం మరో విశేషం. తనకు బెదిరింపులు వస్తున్నాయని.. నామినేషన్ వేసినప్పటినుంచి ఈ బెదిరింపులు మరింతగా పెరిగాయని విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశారని తాను వినకపోవటంతో బెదిరిస్తున్నారంటూ తనకు భద్రత కల్పించాలని ఆమె హైకోర్టును సైతం ఆశ్రయించింది. ఆమె విన్నపాన్ని మన్నించిన హైకోర్టు భద్రత కల్పించాలని ఆదేశించింది.