Hyderabad : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad : హైదరాబాద్ వాసులకు అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Hyderabad : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad

Updated On : September 14, 2025 / 8:26 AM IST

Hyderabad : హైదరాబాద్ వాసులకు అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింల పర్వదినమైన మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని నేడు నగరంలో భారీ ఊరేగింపు జరగనుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read: Danam Nagender: జూబ్లీహిల్స్ టికెట్ నాకివ్వండి..! దానం నాగేందర్ అదిరిపోయే స్కెచ్..! అక్కడ పోటీ చేస్తాననడానికి కారణమిదే..!

ఊరేగింపు ఇలా..
మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని ఊరేగింపు ప్రధానంగా ఫలక్‌నుమా నుంచి చార్మినార్ మీదుగా వోల్టా హోటల్ వరకు.. మక్కా మజీద్ నుంచి నాంపల్లి హజ్ హౌస్ వరకు.. మక్కా మజీద్ నుంచి వోల్టా హోటల్ వరకు.. పత్తార్ ఘాట్ నుంచి అలిజ కోట్ల వరకు జరగనుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఈ ప్రాంతాల్లోనే..
ఫలక్ నుమా, ఇంజన్ బౌలి, నాగుల్‌చింత ఎక్స్‌రోడ్, హిమ్మత్ పురా జంక్షన్, ఓల్గా, హరిబౌలి, పంచ్ మొహల్లా, చార్మినార్, గుల్జార్ హౌజ్, మదీనా జంక్షన్, పత్తర్ గట్టి, మీరాలం మండీ, ఎతేబార్ చౌక్, అలీజా కోట్లా, బీబీ బజార్, వాల్టా హోటల్, అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఎంజే మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నాంపల్లి టీ జంక్షన్, హజ్ హౌస్, ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.


మరోవైపు.. మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కారణంగా ఆదివారం ఓల్డ్ సిటీలోని పర్యాటక ప్రదేశాలను మూసివేయనున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి వెల్లడించారు. చార్మినార్ తోపాటు పాతబస్తీలోని స్మారక చిహ్నాలు, పలు పర్యాటక ప్రదేశాలను మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు.