×
Ad

Group 2 Selection List: గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు..

ఇక, గ్రూప్ 1 పిటిషన్లపైనా హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 22 కు వాయిదా వేసింది.

Group 2 Selection List: 2015లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలపై తెలంగాణ హైకోర్టులో తీర్పు ఇచ్చింది. 2019లో ఇచ్చిన సెలక్షన్‌ లిస్ట్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2015లో గ్రూప్‌-2 OMR షీట్‌ ట్యాంపరింగ్‌ కు గురైందంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కోర్టు ఆదేశాలను టీజీపీఎస్ సీ ఉల్లంఘించిందని తీర్పు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. OMR షీట్లు రీవాల్యుయేషన్‌ చేసి మళ్లీ సెలెక్షన్‌ లిస్ట్‌ ఇవ్వాలని, 8 వారాల్లో తుది లిస్ట్‌ ప్రకటించాలని TGPSCని న్యాయస్థానం. ఇక, గ్రూప్ 1 పిటిషన్లపైనా హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 22 కు వాయిదా వేసింది.