Eatala Rajender: ఈటల రాజేందర్ ఇంటి వద్ద హై టెన్షన్.. పోలీసుల అలర్ట్.. అటువైపు దారులన్నీ బంద్

బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..

Eatala Rajender

Eatala Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శామిర్ పేటలోని ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఈటల రాజేందర్ ఇంటివైపు వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసివేశారు.

 

ఈటల మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద శాడిస్ట్, సైకో, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంలోనే ఆయన ఆనందం పొందుతున్నారు. రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం నడుస్తోంది. ప్రజల జోలికి వస్తే ఖబడ్దార్,” అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈటల వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. ఈటల అన్ని బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కాగా.. శామీర్ పేట్ లోని ఈటల ఇంటిని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. ఈటల నివాసం వద్దకు పెద్దెత్తున బీజేపీ, బీజేవైఎం నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అప్రమత్తమై ఈటల నివాసం వైపు దారులను మూసివేశారు.