Himayath Sagar Gates Opened : హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తివేత

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు  దాదాపుగా  రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.   హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్‌కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ రోజు  జలమండలి అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు.

Himayat Sagar

Himayath Sagar Gates Opened :  గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు  దాదాపుగా  రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.   హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్‌కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ రోజు  జలమండలి అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు.

ఈ సందర్భంగా జలమండలి ఎండీ. దాన కిషోర్ మాట్లాడుతూ, జాలశయానికి నీరు పోటెత్తడంతో ఇప్పటివరకు 3 గేట్లను ఒక్క అడుగు మేరకు ఎత్తివేశామని అన్నారు.  దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా మూసి నది లోతట్టు ప్రాంతాల్లోని    ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. బోర్డు సిబ్బంది మూసి నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా, నగరంలో దాదాపుగా అన్ని మ్యాన్ హోల్ లకి   సేఫ్టీ గ్రిల్స్ తో పాటు,  ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎర్ర జెండా లు (రెడ్ ఫ్లాగ్) ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నగరంలో ఎమర్జెన్సీ  రెస్పాన్స్ బృందాలు తిరుగుతున్నాయి అని అన్నారు. రాబోయే మరో రెండు రోజుల్లో   వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపిన సందర్భంలో,   పరిస్ధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాల కలెక్టర్లను, అధికార యంత్రాగాలతో పాటు, జీహెచ్ఎంసీ మరియు పోలీసు అధికారులను ఆదేశించారు.

హిమాయత్ సాగర్ రిజ్వాయర్‌కు   మొత్తం 17 గేట్లు ఉన్నాయి.  గత ఏడాది  అక్టోబర్ 14న జలాశయానికి 25 వేల క్యూసెక్కుల నీరు పోటెత్తడంతో 13 గేట్లు ఎత్తి దిగువన ఉన్న మూసిలోకి వదిలారు.   హిమాయ‌త్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం – 1763.50 అడుగులు కాగా…. ప్ర‌స్తుత నీటి మట్టం – 1763.00 అడుగులుగా ఉంది.  రిజ‌ర్వాయ‌ర్  పూర్తి  నీటి సామ‌ర్థ్యం – 2.968 టీఎంసీలు కాగా,  ప్ర‌స్తుతం- 2.773 టీఎంసీలు నీరు ఉంది.