HMDA Shiva Balakrishan: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

బాలకృష్ణకు సోదరుడు సునీల్ బినామీగా ఉన్నట్లు, సునీల్ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

Shiva Balakrishna

HMDA Shiva Balakrishan Case : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు రోజుల కస్టడీలో శివబాలకృష్ణ నుంచి కీలక సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను విచారించారు. సునీల్, అతని భార్య పేరుపై భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. జనగామ, గజ్వేల్, కొడకండ్ల, మోత్కూరు, పాలకుర్తి, రిమ్మనగూడ, బీబీనగర్ లో సునీల్ అతని భార్య పేరుపై ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.

Also Read : మహాముదురు.. శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

బాలకృష్ణకు సోదరుడు సునీల్ బినామీగా ఉన్నట్లు, సునీల్ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేటతెల్లమైంది. ఎల్బీనగర్, బంజారాహిల్స్ లో హైరేస్ టవర్స్ ని నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ లో సునీల్ పెట్టుబడి పెట్టాడని ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు బాలకృష్ణ లాకర్స్ లో గుర్తించిన 20లక్షల నగదు, బంగారం, పలు డాక్యుమెంట్లుపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read : Rahul Gandhi: వైఎస్ షర్మిల, సునీతపై సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని ఖండించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?

బాలకృష్ణ సెల్ ఫోన్ డేటాపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. బాలకృష్ణ కాల్ డేటా తీసుకొని విచారిస్తే బాలకృష్ణకు సంబంధించిన బినామీలు, అధికారుల చిట్టా బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

 

 

ట్రెండింగ్ వార్తలు