SR Nagar police station: ఆధునిక హంగులతో పోలీసు స్టేషన్లు : మహమూద్ ఆలీ

హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్ భవనాన్నిహోం మంత్రి మహమూద్ ఆలీ ఈరోజు ప్రారంభించారు.

SR Nagar police station : హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్ భవనాన్నిహోం మంత్రి మహమూద్ ఆలీ ఈరోజు ప్రారంభించారు. రూ.4.20 కోట్ల వ్యయంతో అత్యంత ఆధునిక వసతులతో మూడు అంతస్తుల్లో ఈ భవనాన్నినిర్మించారు. రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని..ఇండియాలో నంబర్ వన్ డిజిపి మహేందర్ రెడ్డి అని గర్వంగా చెపుతున్న అని హోం మంత్రి పోలీసులను అభినందించారు.

నగరంలోని నూతన పోలీస్ స్టేషన్ భవనాలు ఫైవ్ స్టార్ హోటళ్లను తలపిస్తున్నాయని, పోలీస్ వ్యవస్థ లో మార్పు కోసం కే.సీ.ఆర్ రూ.700 కోట్లు మంజూరు చేశారని ఆయన చెప్పారు. ఎస్.ఆర్.నగర్. పోలీసు స్టేషన్ పరిధిలో దూరంగా ఉన్న ప్రజల కోసం బోరబండలో కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని మహమూద్ ఆలీ హామీ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో పోలీసులు చేసిన కృషి వల్ల కరోనా కేసులు తగ్గాయని..పోలీసులు ప్రజల కోసం వున్నారనే నమ్మకం కల్గించారని అన్నారు.

కార్యక్రమంలో పాల్గోన్న డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం వుందని..పోలీసులు ప్రజల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు.  నేరాలు నిరోధించే విధంగా పోలీసులు పాటు పడాలని అప్పుడే ప్రజలు హర్షిస్తారని మహేందర్ రెడ్డి అన్నారు.  సీఎం కేసీఆర్ విజన్ ఉన్న   నాయకుడు  అని.. అందుకే రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతోందని ఆయన అన్నారు.

నిజాం ప్రభుత్వ హయాంలో ఉన్న అవుట్ పోలీస్ స్టేషన్, చౌక్ పోలీసు స్టేషన్లను గుర్తించి వాటిని 21 నూతన భవనాలోకి మారుస్తున్నామని చెప్పారు.  ప్రతేక డిజైన్ ద్వారా పోలీస్ స్టేషన్ లు అందుబాటులో వస్తున్నాయని….ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అన్ని విధాలుగా పోలీస్ వ్యవస్థ మారుతుందని డీజీపీ తెలిపారు.

గ్లోబల్ పోలీస్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకువస్తున్నామని. 6లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని…టెక్నాలజీ వినియోగించుకుని నిపుణులతో పోలీసు శాఖ ముందుకు వెళుతోందని ఆయన చెప్పారు.  దేశానికి ఆదర్శం కానున్న పోలీస్ మెయిన్ కమాండ్ కంట్రోల్  సెంటర్ను  బంజారాహిల్స్ లో అతి త్వరలోనే ముఖ్యమంత్రి  కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంబించనున్నామని డీజీపీ తెలిపారు.  ఈకార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే గోపీనాధ్ తదితరులు పాల్గోన్నారు.

ట్రెండింగ్ వార్తలు