‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తరహా ఘటన.. పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ రక్తం
Medchal District : మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో తరహా ఘటన చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Updated on- March 14, 2026 / 02:40 PM IST
Medchal Malkajgiri District
Medchal District : మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో తరహా ఘటన చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఓ యువకుడు యువతికి ప్రాణాంతకమైన HIV (ఎయిడ్స్) సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఘట్‌కేసర్ పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Monalisa: కుంభమేళా మోనాలిసా పెళ్లిపై బిగ్ ట్విస్ట్.. ఇది లవ్ జిహాద్ అంటూ తండ్రి సంచలన కామెంట్స్
నిందితుడు మనోహర్‌తో బాధితురాలికి వివాహం నిశ్చయమైంది. అయితే, మనోహర్‌తోపాటు అతని తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ ఉందని తెలియడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో ఈనెల 11వ తేదీన మనోహర్ యువతి ఇంటికి వెళ్లి పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. పెండ్లికి యువతి, వారి కుటుంబ సభ్యులు ససేమీరా అనడంతో వారిపై మనోహర్ కక్ష పెంచుకున్నాడు.
తన వ్యాధి గురించి తెలిసి పెళ్లికి నోచెప్పిందనే కోపంతో మనోహర్ ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఎయిడ్స్ వ్యాధి సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా తీసి ఆ యువతి శరీరంలోకి ఎక్కించాడు. బాధితురాలి విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘట్కేసర్ పోలీసులు వెంటనే స్పందించి మనోహర్ ను అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. అయితే, నిందితుడు మనోహర్ ఈ రక్తాన్ని ఎక్కడ సేకరించాడు, అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు మనోహర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
