Crime News: లిఫ్ట్ లో అనుమానాస్పద స్థితిలో పనిమనిషి మృతి
ఫ్ట్ లో ఇరుక్కుని పనిమనిషి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన షేక్‌పేట్ లక్ష్మినగర్ లో చోటుచేసుకుంది. ఇంటిలోని మూడో అంతస్తులో లిఫ్ట్ లో ఇరుక్కుని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది
- Bharath Reddy
- Published On : January 22, 2022 / 08:13 AM IST
Crime
Crime News: హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కుని పనిమనిషి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన షేక్‌పేట్ లక్ష్మినగర్ లో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..షోలాపూర్ కు చెందిన వీణ తన భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని కార్వాన్ లో నివసిస్తుంది. భర్త టేలర్ గా పనిచేస్తుండగా.. వీణ ఇళ్లలో పనిమనిషిగా చేస్తుంది. ఈక్రమంలో శుక్రవారం షేక్‌పేట్ లక్ష్మినగర్ లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో పనిచేదేందుకు వచ్చిన వీణ, ఇంటిలోని మూడో అంతస్తులో లిఫ్ట్ లో ఇరుక్కుని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.
Also read: Rains in Telangana: తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు
సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు..ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు జరుపుతున్నారు. క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. లిఫ్ట్ లో ఊపిరాడక వీణ మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా అంచనా వేశారు. పోస్టుమార్టం నివేదిక, క్లూస్ టీం రిపోర్ట్ వచ్చిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Also read: Andre Russel: బీపీఎల్ మ్యాచ్ లో విచిత్రంగా ఔటైన ఆండ్రే రస్సెల్
