Huge explosion
Huge Explosion : హైదరాబాద్ లో భారీ పేలుడు సంభవించింది. మణికొండలోని లాలమ్మ గార్డెన్ లో బుధవారం సాయంత్రం భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, కెమికల్ డబ్బాలు పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.