Fire Breaks Out : హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఆరుగురిని రక్షించిన కానిస్టేబుల్

ప్రాణాలతో భయంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది... Hyderabad Fire Breaks Out

fire broke out

హైదరాబాద్ పంజాగుట్టలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రమంజిల్ సమీపంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రాణాలతో భయంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.

ఆరుగురిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురిని రక్షించారు. ఇవాళ తెల్లవారుజామున భవనంలో మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్‌ 6వ అంతస్తులోని ఫ్లాట్‌లో ఆరుగురు చిక్కుకుపోయారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ డంబెల్స్ తో తలుపులు పగలగొట్టి మంటల్లో చిక్కుకున్న ఆరుగురిని బయటికి తీసి రక్షించారు.