electricity demand
Electricity Demand : తెలంగాణలో మరోసారి భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోల్చితే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో శుక్రవారం (ఫిబ్రవరి 10,2023) కంటే శనివారం (ఫిబ్రవరి 11,2023) అత్యధిక విద్యుత్ ను వినియోగించారు. శనివారం ఉదయం 10 గంటల వరకు 14 వేల 350 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించారు. శుక్రవారం (ఫిబ్రవరి10,2023) సాయంత్రం 4 గంటలకు వరకు 14 వేల 169 యూనిట్లుగా నమోదు అయింది.
గతేడాది ఇదే రోజున 11 వేల 420 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించారు. ఈ ఏడాది మే నెల వరకు రోజువారి విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాగు విస్తీర్ణ పెరుగడంతోపాటు పారిశ్రామిక అసవరాలు పెరిగిన నేపత్యంలో శుక్రవారం (ఫిబ్రవరి10,2023)తో పోల్చితే శనివారం ( ఫిబ్రవరి 11,2023) 14 వేల 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది.
Telangana Electricity : తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం..రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్
శుక్రవారం (ఫిభ్రవరి 10,2023) ఇదే సమయానికి 14 వేల 169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడగా శనివారం (ఫిబ్రవరి11,2023) తాజాగా ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ రికార్డు స్థాయిలో 14 వేల 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. ఈ డిమాండ్ కూడా మధ్యాహ్నం తర్వాత మరింత పెరిగే అవకాశమున్నట్లు విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మార్చి నెలలో 14 వేల 160 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే గతేడాది రికార్డును అధిగమించినట్లుగా చెప్పవచ్చు.
ఈ సారి వేసవిలో కూడా 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరముందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్నది వేసవి కాలంగా కాబట్టి సాగు విస్తీర్ణంతోపాటు గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ఇటు తెలంగాణ డిస్కంలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.