Rush At Toll Gates : పండుగ సెలవులు ముగిశాయి. స్కూళ్లు, ఆఫీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో పండక్కి ఊరెళ్లిన పట్టణవాసులు.. సొంతూళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. అందరూ ఒక్కసారిగా రావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి నగర బాట పట్టారు పట్టణవాసులు. దీంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. పంతంగి, నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులుతీరాయి. ఫాస్టాగ్ స్కాన్ కు సమయం పడుతుండటంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.