Huzurabad By Election : కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ? బై పోల్‌‌ను లైట్‌‌గా తీసుకుందా ?

హస్తం పార్టీ బైపోల్‌ను లైట్‌గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. వరుసపెట్టి భేటీలు నిర్వహిస్తున్నా.. అభ్యర్థిని మాత్రం తేల్చలేకపోతున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.

Huzurabad Congress Candidate : హుజూరాబాద్ ఉప ఎన్నిక అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 02వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నేతల ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకపోతున్నారు. కానీ…ప్రధాన పార్టీలో ఒకటైన కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. ఎవరినీ రంగంలోకి దింపాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. హస్తం పార్టీ బైపోల్‌ను లైట్‌గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. వరుసపెట్టి భేటీలు నిర్వహిస్తున్నా.. అభ్యర్థిని మాత్రం తేల్చలేకపోతున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.

Read More : Badvel By-Election : జగన్‌‌ను కలువనున్న కడప వైసీపీ నేతలు

అనుకోకుండా వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌తో కాంగ్రెస్‌ పార్టీ ఇంకా అప్రమత్తం కానట్లే కనిపిస్తోంది. ఎన్నిక ఇప్పట్లో ఉండదన్న అంచనాతో ఇప్పటివరకు అభ్యర్థిని తేల్చని కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుకుంటున్నారు. హుజూరాబాద్‌ బరిలో ఎవరిని పోటీకి దింపాలి.. ఎవరైతే పోటీ ఇవ్వొచ్చన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు హస్తం నేతలు. మొదట్లో మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థి అవుతారని భావించినా.. ఇప్పుడు పార్టీ అభిప్రాయంలో మార్పు వచ్చిందని.. దళిత అభ్యర్థిని పోటీ చేయించే ఆలోచన ఉందని సమాచారం.

Read More : SCR : రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు

కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరును కూడా పరిశీలించినా.. ఆయన కూడా పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని తెలిసింది. దీంతో చేసేదేం లేక.. హుజూరాబాద్‌ స్థానిక నేతల్లోనే ఒకరిని ఎంపిక చేసి.. బరిలో దింపాలని చూస్తోందట కాంగ్రెస్‌ హైకమాండ్‌. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై సీఎల్పీ కార్యాలయంలో.. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాత్రి వరకూ చర్చలు జరిగినా.. అభ్యర్థి ఎంపికపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. సమావేశంలో అభ్యర్థికి సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదని తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై 2021, సెప్టెంబర్ 30వ తేదీ గురువారం, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.

ట్రెండింగ్ వార్తలు