Huzurabad By Poll : ఓటమిపై స్పందించిన కేటీఆర్.. 20 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చూసాం

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై ఐటీ మంత్రి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గడిచిన 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందని అన్నారు.

Huzurabad By Poll (2)

Huzurabad By Poll : హుజూరాబాద్ ప్రజలు ఈటలకే పట్టం కట్టారు. 23 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్.. మంత్రి కేటీఆర్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

టీఆర్ఎస్ గడిచిన 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన గెల్లు శ్రీనివాస్‌ను కేటీఆర్ అభినందించారు. టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఇక మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌కు కృతఙ్ఞతలు తెలియచేశారు కేటీఆర్.. ఇక సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కేటీఆర్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలందరూ భవిష్యత్ పోరాటాల్లో ముందుకు సాగేందుకు మరింత దృఢ సంకల్పంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు.