Huzurabad Bypoll : ఓటేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు, 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం నమోదయింది.

Huzurabad Bypoll : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్‌ కొనసాగుతోంది. మూడు గంటల వరకు 61.66 శాతం నమోదయింది. ఇదే ట్రెండ్ కొనసాగితే సాయంత్రంలోపు 85 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు చోట్ల ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ… ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. అత్యధికంగా వీణవంక మండలంలో 47.65 శాతం పోలింగ్ నమోదవ్వగా 19 వేల 106 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read More : Gellu Srinivas : ఇంట్లో సిలిండర్ కు దండం పెట్టుకుని పోలింగ్ బూత్ కు…ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్

అత్యంత తక్కువగా ఇల్లందకుంటలో 42.09 శాతం పోలింగ్‌ నమోదవ్వగా 10 వేల 439 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక హుజూరాబాద్‌లో 45.05 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 27 వేల 784 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లో 46.76 శాతం, జమ్మికుంటలో 45.36 శాతం పోలింగ్ నమోదైంది.

Read More : Huzurabad : భారీ పోలింగ్‌ దిశగా హుజూరాబాద్‌లో ఓటింగ్

మరోవైపు… టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్వగ్రామం హిమ్మత్‌ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్‌, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హిమ్మత్‌ నగర్‌కు బీజేపీ నేత తుల ఉమా రావడాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తీవ్రంగా తప్పు పట్టారు. పోలింగ్ కేంద్రానికి నాన్‌ లోకల్స్‌ ఎలా వస్తారంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. టీఆర్‌ఎస్‌ నేతల ఆందోళనకు పోటీగా బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. .వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు.

ట్రెండింగ్ వార్తలు