Huzurabad : భారీ పోలింగ్‌ దిశగా హుజూరాబాద్‌లో ఓటింగ్

హుజూరాబాద్‌లో ఓటింగ్ భారీగా సాగుతోంది. సాయంత్రంలోపు 90 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం నమోదయింది.

Huzurabad : భారీ పోలింగ్‌ దిశగా హుజూరాబాద్‌లో ఓటింగ్

Huzurabad (2)

Voting heavy polling in Huzurabad : హుజూరాబాద్‌లో ఓటింగ్ భారీగా సాగుతోంది. సాయంత్రంలోపు 90 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం నమోదయింది. ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ…ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.

కమలాపూర్‌లోని పోలింగ్‌ బూత్‌ నంబర్ 262లో.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. నియోజకవర్గంలో పలు కేంద్రాలకు వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న ఈటల రాజేందర్‌..90 శాతం ఓటింగ్‌ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఓటర్లు తనపై ప్రేమను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్న ఈటల.. ధర్మం గెలుస్తుందన్నారు.

Huzurabad By Election : హుజూరాబాద్ ఉపఎన్నిక..డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్న ఓటర్లు..

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. హుజూరాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో.. రెండు ఈవీఎంలను వినియోగిస్తున్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. హుజూరాబాద్‌లో 2 లక్షల 37 వేల 22 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా పేషంట్లకు సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్‌కు అనుమతిస్తారు.