Huzurabad By Election : హుజూరాబాద్ ఉపఎన్నిక..డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్న ఓటర్లు..

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈక్రమంలో డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు డిమాండ్ చేయటం ఆసక్తికరంగా మారింది.

Huzurabad By Election : హుజూరాబాద్ ఉపఎన్నిక..డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్న ఓటర్లు..

Huzurabad By Election

Huzurabad By Election 2021: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభం అయిన కొంతసేపటికే టీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు బాహా బాహీకి దిగారు. పోలింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రారంభమైన గొడవకాస్తా ఇరు వర్గాలమధ్యా ఘర్షణకు దారి తీసింది. వీరవంక మండలంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్రమంలో కొంతమంది ఓటర్లు డబ్బులిస్తేనే ఓట్లు వేస్తామని బహిరంగంగా చెప్పటం గమనించాల్సిన విషయం. ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ లోని ఘనముకుల, కోర్కల్ లో జనాలు డబ్బులిస్తేనే ఓట్లు వేస్తాం..లేదంటే ఓట్లు వేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఎవరి డబ్బులిస్తేవారికే ఓట్లు వేస్తామని మాకు సంబంధించి దాదాపు 400 నుంచి 500 ఓట్లు ఉన్నాయని..డబ్బులిస్తేనే మేమంతా ఓట్లు వేస్తామని..లేదంటే 500ల ఓట్లు మైనస్ అవుతాయి అంటూ ఇల్లందుకుంట మండలంలో ఓ మహిళ బహిరంగంగా చెబుతోంది.

Read more : Huzurabad : డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు

పరిస్థితి ఇలా ఉంటే టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఘనుముక్కలలో ఎంట్రీ ఇచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓట్లు వేస్తున్న ఈ సమయంలోమీరు వచ్చి ప్రచారం ఎలా చేస్తారు? అంటూ ప్రశ్నించటంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.హుజూరాబాద్ ఉపఎన్నికలో భాగంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్‌ స్టేషన్లలో 2,37,022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరి టీఆర్ఎస్‌కు సవాలు విసురుతున్నారు.

Read more : Huzurabad By Poll 2021 : ప్రారంభమైన హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్

తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఈటల, అభివృద్ధి పేరుతో టీఆర్‌ఎస్ విస్తృత ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాసయాదవ్ బరిలో ఉండగా, ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. సీఎం కేసీఆర్ కేబినెట్లో మినిస్టర్ గా ఉన్న ఈటల రాజేందర్ పై భూ కబ్జా కేసుల ఆరోపణలు రాగా మంత్రి పదవితో పాటు ఈటల టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అనంతం బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతో హుజూరాబాద్ లో బై పోల్‌ ప్రారంభమై కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనటం..ఇరు పార్టీలో ఈ ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కరోనా పేషెంట్లకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించారు. హుజూరాబాద్‌ బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా.. బద్వేల్‌లో 15మంది అభ్యర్థులు రేస్‌లో ఉన్నారు

కాగా..హుజురాబాద్‌లో డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ శశాంక్ గోయల్ ఇప్పటికే  తెలిపారు. తమకు డబ్బులు రాలేదంటూ కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు. ఓటు కోసం డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. ఈక్రమంలో డబ్బులిస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు చెప్పటం విశేషంగా మారింది.