Huzurabad : డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు

హుజురాబాద్‌లో డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదంటూ కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు.

Huzurabad : డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు

Shashank

Updated On : October 30, 2021 / 8:47 AM IST

criminal cases against voters : హుజురాబాద్‌లో డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదంటూ కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు. ఓటు కోసం డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని చెప్పారు.

మరోవైపు హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కరోనా పేషెంట్లకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించారు. హుజూరాబాద్‌ బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా.. బద్వేల్‌లో 15మంది అభ్యర్థులు రేస్‌లో ఉన్నారు.

Huzurabad By-Election : రేపే హుజూరాబాద్ బైపోల్.. డిసైడర్లు మహిళా ఓటర్లే

హుజూరాబాద్ అభ్యర్థుల జాతకాలను 2 లక్షల 37 వేల మంది ఓటర్లు డిసైడ్ చేయనున్నారు. హుజూరాబాద్‌లో 127 సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ నిఘా పెట్టింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. హుజూరాబాద్ 80, కమలాపూర్‌లో 65, వీణవంకలో 55, ఇల్లంతకుంటలో 29, జమ్మికుంటలో 77 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

ఉప ఎన్నిక సందర్భంగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో 144సెక్షన్‌ అమల్లో ఉంది. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఉప ఎన్నికలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూసేందుకు 20 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించాయి. బందోబస్తులో 2 వేల 245 మంది పోలీసులు నిమగ్నమయ్యారు.