Hyderabad : దేవాలయాల్లో పనిచేసే పూజారుల్ని అయ్యవార్లు అంటారు. వేదాలు..శాస్త్రాలు చదివి భక్తులకు,దేవుళ్లకు మధ్య వారధిగా ఉండే పూజారుల్ని ఎంతో గౌరవంగా చూస్తాం. అటువంటి పూజారి విచక్షణ మరిచిపోయాడు. కామవాంఛలతో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీక్ష తీసుకుని గుడిలో అమ్మవారిని సేవించటానికి వచ్చిన బాలికను పలు రకాలుగా వేధింపులకు గురిచేశాడు. అర్థరాత్రి సమయంలో నగ్నంగా పూజలు చేస్తే నువ్వు కోరుకున్నది జరుగుతుందంటూ గుడికి వెళ్లే ఆమెను పలు రకాలుగా వేధింపులకు గురిచేసిన ఘటన హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దేవాలయంలో 46 ఏళ్ల వెంకటేశ్వర శర్మ అనే అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్ 17న ఆ ప్రాంతానికే చెందిన 16ఏళ్ల బాలిక అమ్మవారి దీక్ష తీసుకుంది. ప్రతీరోజు సాయంత్రం అమ్మవారి దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించేది.
ఆ బాలికపై అర్చకుడు వెంకటేశ్వర శర్మ కన్ను పడింది. ఎలాగైనా సరే ఆమెనుమాయం చేయాలనుకున్నాడు. అలా ఓరోజు ఆ బాలికతో మంచిగా మాటలు కలిపాడు. ఇలా సాయంత్రం సమయంలో వచ్చి పూజలు చేస్తు నువ్వు అనుకున్నది జరగదు..అంటూ నమ్మించాడు. దానికి ఆ బాలిక ఏంచేయాలి? అని అడిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలని సాయంత్రం వస్తే ఏం చేయాల చెబుతానని చెప్పాడు.
ఆ పూజారి మాటలు నమ్మిన ఆ బాలిక గత ఆదివారం (నవంబర్ 1,2020)న సాయంత్రం గుడికి వచ్చింది. అలా వచ్చిన ఆమెను చీకటి పడేవరకూ వెయిట్ చేయించీ..ఏవో మాత్రలు కలిపిన వాటర్ ఇచ్చాడు. ఇది తాగేసి వెళ్లు..రాత్రి రావాలని..అప్పుడు బట్టలు లేకుండా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలని చెప్పాడు. అలా పూజిస్తే అమ్మవారు కరుణించి నువ్వు కోరిన కోరికలు తీరుస్తుందని అని చెప్పాడు.
ఆ వాటర్ తాగిన బాలిక ఇంటికెళ్లగా..అర్చుకుడు ఇచ్చిన వాటర్ తాగిన ఆమెకు వాంతులు అయ్యాయి. దీంతో ఏమైందని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం అర్చకుడు వెంకటేశ్వర శర్మను అరెస్ట్ చేశారు.
బాలికను వేధించిన అర్చకుడు వెంకటేశ్వర శర్మను అరెస్ట్ చేశామని అతన్ని విచారిస్తున్నామని ఏసీపీ శ్యాంప్రసాదరావు. సీఐ జగదీశ్వరరావులు తెలిపారు.