Meru International School: ‘మేరు’ ఇంటర్నేషనల్ స్కూల్‌కి దేశంలోనే అత్యుత్తమ అవార్డు

విద్యలో నాణ్యత, విలువలతో బోధన అందిస్తున్న విద్యా సంస్థ 'మేరు ఇంటర్నేషనల్ స్కూల్'.

Meru International School: విద్యలో నాణ్యత, విలువలతో బోధన అందిస్తున్న విద్యా సంస్థ ‘మేరు ఇంటర్నేషనల్ స్కూల్’. అధునాతన విద్యా ప్రమాణాలతో భాగ్య నగరంలో విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా, సరికొత్త సంస్కరణలతో ప్రఖ్యాతిగాంచిన మేరు విద్యా సంస్థ అరుదైన గుర్తింపు దక్కించుకుంది.

Meru1

దేశంలోని పాఠశాలలకు ఎడ్యుకేషన్ వరల్డ్ అందించే ‘ఎమర్జింగ్‌ హై పొటెన్షియల్‌ స్కూల్‌’ ర్యాంకింగ్స్‌లో ‘మేరు’కు ఉత్తమ ర్యాంకింగ్స్‌ దక్కాయి.

2021-2022 సంవత్సరానికి గాను.. “మేరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌” దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, హైదరాబాద్ నగరంలోనూ మొదటి స్థానంలో నిలిచింది.
అంతర్జాతీయ విద్యా వేత్తలతో సీఫోర్స్‌ అనే సంస్థ దేశవ్యాప్తంగా 3వేలకు పైగా స్కూల్స్‌పై నిర్వహించిన సర్వేలో మేరు ఈ ఘనత దక్కించుకుంది.

Meru2

అధునాతన సాకర్యాలు, మౌలిక సదుపాయాలు, విద్యా బోధన, నాణ్యమైన విద్య అందించే తీరును బట్టి స్కూళ్లకు అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌‌కి ఈ అరుదైన గౌరవం దక్కింది.

4

ఈ సంధర్భంగా విద్యా సంస్థ డైరెక్టర్‌ మేఘన రావు జూపల్లి మాట్లాడుతూ.. “మేరు స్కూల్‌కి ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం గర్వంగా ఉంది. విలువలతో కూడిన విద్యను అందించే క్రమంలో ఏ విషయంలోనూ రాజీ పడకుండా చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కిన ఫలితంగా భావిస్తున్నాం.” అని అన్నారు.

3

మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్ పిళ్లై మాట్లాడుతూ.. “ఇది స్కూల్‌కే గర్వకారణం. నాణ్యత, విలువలతో కూడిన బోధనకు లభించిన అవార్డుగా దీనిని మేం భావిస్తున్నాం. ఈ అవార్డును స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు, వారి తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నాం” అని అన్నారు.

2

ట్రెండింగ్ వార్తలు