Hyderabad Cricket Association : హెచ్‌సీఏ వివాదానికి చెక్ పెట్టిన కల్వకుంట్ల కవిత?

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వివాదాలకు టీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్‌ పెట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌, ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ వర్గాల మధ్య కవిత సయోధ్య కుదిర్చినట్టు తెలిసింది. హైదరాబాద్ లోని కవిత నివాసంలో జరిగిన సమావేశానికి అజర్, జాన్ తోపాటు హెచ్‌సీఏ ఇతర సభ్యులు వచ్చారు.

Hyderabad Cricket Association :  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వివాదాలకు టీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్‌ పెట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌, ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ వర్గాల మధ్య కవిత సయోధ్య కుదిర్చినట్టు తెలిసింది.

హైదరాబాద్‌‍లోని కవిత నివాసంలో జరిగిన సమావేశానికి అజర్, జాన్ తోపాటు హెచ్‌సీఏ ఇతర సభ్యులు వచ్చారు. వివాదాలు, కుమ్ములాటలు పక్కన బెట్టి పనిచేయాలని కవిత సూచించినట్లు సమాచారం. కోర్టులో ఉన్న కేసులు, ఒకరికొకరు ఇచ్చుకున్న షోకాజ్ నోటీసులు అన్నీ వెనక్కి తీసుకోని హెచ్‌సీఏ కార్యకలాపాలు తక్షణమే పునరుద్దరించాలని సూచించారు.

కవిత మధ్యవర్తిత్వంతో.. వివాదానికి కేంద్ర బిందువైన అంబుడ్స్‌మన్‌ దీపక్‌ వర్మ విషయంలోనూ అజర్‌ కాస్త వెనక్కి తగ్గారట. జిల్లాల గుర్తింపు విషయమై కవిత.. హెచ్‌సీఏతో చర్చించారు. ఇటీవల ఆరు కొత్త జిల్లాలకు గుర్తింపు ఇస్తున్నట్టు అజరుద్దీన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అజర్‌, జాన్‌ వర్గాల మధ్య వివాదం సద్దుమణగడంతో జులై 18న జరగాల్సిన ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌ లేఖ ద్వారా తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు